RRR to Join 1000 Cr : సినిమా బంపర్ విక్టరీ కొట్టినాగానీ, బ్రేక్ ఈవెన్ గురించి ఎందుకు చర్చ జరుగుతోంది.? ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో వినిపిస్తున్న నెగెటివిటీ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఇది మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా. ఏ సినిమాలో అయినా లోపాలు వుండొచ్చు. అస్సలంటూ లోపాల్లేని కళాఖండాన్ని ఎవరైనా వెండితెరపై ఆవిష్కరించగలరా.? సాధ్యం కాదు.
అసలు లోపాల్లేని సినిమా తెరకెక్కించడమే సాధ్యపడదు. ఎవరూ లోపాలతో సినిమాల్ని తెరకెక్కించాలనుకోరు. ‘సినిమాటిక్ లిబర్టీ’ అని అందుకే అంటుంటారు.
ఇక, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వసూళ్ళ విషయానికొస్తే, దేశం నివ్వెరపోతోంది ఈ వసూళ్ళని చూసి. 710 కోట్ల రూపాయల గ్రాస్ దాటేసింది ‘ఆర్ఆర్ఆర్’. అతి త్వరలో ఈ చిత్ర రాజం వెయ్యి కోట్ల క్లబ్బులోకి చేరబోతోంది.
అది సోమవారం నాటికే సాధ్యం కావొచ్చు కూడా. నిజానికి, ఇది సినీ అభిమానులంతా గర్వపడాల్సిన సందర్భమే.
కానీ, ఇంతలోనే ‘బ్రేక్ ఈవెన్’ అంటూ విమర్శలొస్తున్నాయి. చాలా చోట్ల ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా కాలేదన్నది కొందరి అభ్యంతరం. వాళ్ళెవరు అభ్యంతరాలు పెట్టడానికి.? సినిమాని రికార్డు మొత్తానికి అమ్మేశారు ఏరియాల వారీగా.
సో, రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినప్పుడు.. ఆ మొత్తం రికవరీ అవడానికి సమయం పడుతుంది. ఇప్పుడే ఏదో సినిమా రన్ ఆగిపోయినట్లుగా రికవరీల గురించీ, బ్రేక్ ఈవెన్ల గురించీ మాట్లాడితే ఎలా.?
నో డౌట్, అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయిందంటూ ట్రేడ్ పండితులు లెక్కలు చెబుతున్నారు. అంచనాలకు మించి లాభాల్ని వెనకేసుకున్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. ఏది నిజమో తెలియని పరిస్థితి.
కానీ, ‘ఆర్ఆర్ఆర్’ పరుగు ఆగడంలేదు.. గర్వపడాల్సిన విషయమే కదా ఇది.!