RRR Young Tiger NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద అతని అభిమానులు చాలా చాలా జాలి పడుతున్నారు.. అదీ చాలా చాలా ఆవేదనతో. ఎందుకిలా.? ఇంకెందుకు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఎన్టీయార్ చాలా సమయం వృధా చేసుకున్నాడని. నిజమేనా.? యంగ్ టైగర్ ఎన్టీయార్ అంతలా సమయాన్ని వృధా చేసుకున్నాడా.? ఏది నిజం.!
నో డౌట్, ఎన్టీయార్ చాలా సమయం వృధా చేశాడు. కానీ, దాన్ని వృధా అనగలమా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కోవిడ్ కారణంగా రెండేళ్ళ సమయాన్ని చాలామంది నటీనటులు నష్టపోయారు. సామాన్యులూ నష్టపోయారు. సో, యంగ్ టైగర్ ఈ విషయంలో తప్పు చేశాడని అనలేం.
మరి, రామ్ చరణ్ ఎలా ‘ఆర్ఆర్ఆర్’ చేస్తూనే, ‘ఆచార్య’ సినిమా చేసేసినట్లు.? ఇది కాస్త లాజికల్‌గా ఆలోచించాల్సిన విషయమే. ఇదే ప్రశ్న యంగ్ టైగర్ ఎన్టీయార్ మీదకి ఆయన అభిమానుల నుంచి దూసుకొస్తోంది. అయితే, ఇక్కడో చిన్న లాజిక్కుని యంగ్ టైగర్ అభిమానులు మిస్సవుతున్నారు.
యంగ్ టైగర్, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ చేసేశాడు. అది ఆషామాషీ గేమ్ షో కాదు. ఆ గేమ్ షోతో యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇంటింటికీ వెళ్ళిపోయాడు. సో, యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘నష్టపోయాడు’ అన్నదాంట్లో వాస్తవం లేదు. ఆ మాటకొస్తే, జక్కన్న సినిమా కోసం ఎంత సమయాన్ని కేటాయించినా అది నష్టపోయినట్టే కాదు.
ఎన్టీయార్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేసింది ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్ పరిస్థితి వేరు. అంతుకు ముందే ‘జంజీర్’ సినిమా చేసేశాడు చరణ్. అది ఫ్లాపయ్యిందనుకోండి.. అది వేరే సంగతి.