లండన్ లో 1000 ఏళ్ళనాటి పబ్ లో సందడి చేసిన రోహిణి..వీడియో వైరల్!

బుల్లితెర నటి, జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట బుల్లితెర నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మడు నటిగా మంచి గుర్తింపు పొందింది. తర్వత అనారోగ్యం కారణంగా కొంత కాలం ఇండస్ట్రీకి దూరమైన రోహిణి తర్వాత ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో నటిగా మాత్రమే కాకుండా జబర్దస్త్ లో కూడా కమెడియన్ గా తన సత్తా చాటుతోంది. రోహిణి జబర్దస్త్ లో చేసే కామెడీ పంచ్ లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమంది ప్రేక్షకులు కేలవం ఈమె స్కిట్ కోసమే జబర్ధస్త్ చూస్తున్నారు. రోహిణి జబర్దస్త్ ద్వారా అంతలా పాపులర్ అయింది.

దీంతో ఈమె జబర్దస్త్ లో మాత్రమే కాకుండా అనేక టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది. రోహిణి ఇటీవల బంగార్రాజు సినిమాలో కూడా హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది. టీవీ షోలతో నిత్యం బిజీగా ఉండే రోహిణి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా మరింత పాపులర్ అయ్యింది. యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో ఫన్నీ వీడియోలు, షాపింగ్ వీడియోస్, హోమ్ టూర్ వీడియోస్ ద్వారా యూట్యూబ్ లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా రోహిణి లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

రోహిణి లండన్ లో తను గడిపే ప్రతి నిమిషం కెమెరాలో బంధిస్తూ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో రోహిణి లండన్ లో 1000 ఏళ్ళ నాటి పబ్ ను కూడా తన వీడియోల ద్వార నెటిజన్స్ కి చూపించింది. రోహిణి పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో లండన్ లోని 1000 ఏళ్ళనాటి పబ్ ను చూపిస్తూ అందులో ఉండే పురాతన వస్తువులు, జంతువుల గుర్తులు, అక్కడ ఫేమస్ ఫుడ్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.