Ghup Chup Ganesha: దేశవ్యాపంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరు పండుగను ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే వినాయక చవితి సందర్బంగా కొన్ని మూవీల మేకర్స్ సినిమాలకు సంబందించిన అప్డేట్స్ మీ విడుదల చేసారు. అందులో భాగంగానే గప్ చుప్ గణేష్ మూవీ నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని విడుదల చేసారు. మరి ఆ వివరాల్లోకి వెళితే..
కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రోహన్, రిదా జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా వినాయక చవితి సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు.

ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక మొహమాటస్తుడైన అబ్బాయి జాబ్ తెచ్చుకోలేక బాధపడుతుంటే తన లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చి, జాబ్ కూడా వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయింది అని కామెడీ ఎమోషనల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా త్వరలో డైరెక్ట్ ఓటీటీ లోకి రానుంది.
