‎O Cheliya: హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ఓ చెలియా టీజర్ విడుదల.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే!

‎O Cheliya: ఎం.నాగరాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో నాగ ప్రవీణ్, కావేరి కర్ణిక, ఆధ్య రెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ఓ చెలియా. ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపాశ్రీ కొపురు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసారు మేకర్స్.

‎తాజాగా ఓ.. చెలియా నుంచి టీజర్‌ ను విడుదల చేశారు మేకర్స్. హీరో శ్రీకాంత్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి మూవీ యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. అయితే టీజర్ రిలీజ్ తర్వాత హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. నాకు టీజర్ చాలా నచ్చింది. యంగ్ టీం అందరూ కలిసి ఈ మూవీని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది అని చెప్పుకొచ్చారు హీరో శ్రీకాంత్.

O Cheliya Telugu Movie Teaser | Naga Pranav | Kaveri Karnika | Ajay Ghosh | Naga Rajasekhar Reddy
‎కాగా తాజాగా విడుదల అయిన టీజర్ ని చూస్తుంటే హారర్, లవ్ జానర్లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. అయితే తాజాగా విడుదలైన టీజర్ ని చూసిన ప్రేక్షకులు అదిరిపోయింది రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు గుర్తింపును తెచ్చి పెడుతుందో చూడాలి మరి. అలాగే ఈ సినిమా టీజర్ ని చూసేయండి.