Home News ఈసారి అల్లు శిరీష్ మీద ప్రతాపం చూపిన ఆర్జీవీ

ఈసారి అల్లు శిరీష్ మీద ప్రతాపం చూపిన ఆర్జీవీ

Rgv Bad Comments On Allu Sirish
రామ్ గోపాల్ వర్మ పైత్యం ఏమాత్రం తగ్గలేదు. అంతకంతకు పెరుగుతోందే తప్ప కంట్రోల్ కావట్లేదు.  ఇతరుల మీద పడి ఏడ్చే ధోరణి కొనసాగిస్తూనే ఉన్నాడు.  ఆర్జీవీ ఎక్కువగా టార్గెట్ చేసేది మెగా ఫ్యామిలీ హీరోలనే.  పవన్ కళ్యాణ్ మీద అనేకసార్లు నోరుపారేసుకున్న ఆర్జీవీ ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవి మీద కూడ అనవసర కామెంట్లు చేశారు. వారి మీద సినిమాలు తీసి పబ్బం గడుపుకున్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు అల్లు శిరీష్ మీద కూడ ప్రతాపం చూపారు. అల్లు శిరీష్ కొన్నిరోజుల క్రితం వర్కవుట్స్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  
 
అందులో శిరీష్ బాగా బాడీ బిల్డప్ చేస్తూ కనబడ్డారు.  దానికి చాలామంది ఆయన్ను ప్రశంసించారు కూడ.  కానీ ఆర్జీవీ మాత్రం తేడాగా స్పందించారు. అందరిలా మాట్లాడితే తాను ఆర్జీవీ ఎందుకు అవుతాను అనుకున్నారో ఏమో కానీ అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు.  శిరీష్ ఫోటోలను షేర్ చేస్తూ ‘ఈ నా కొడుకు కెనాన్ ది బార్బెరియన్, ఆర్నాల్డ్ కొడుకు కాదు.  అల్లు అరవింద్ కొడుకు.  అల్లు సార్ మీ… కి.. జోహార్’ అంటూ అతి తెలివి చూపించారు.  నిజంగా ఆర్జీవీకి శిరీష్ ను విపరీతంగా, వాస్తవికంగా పొగడాలి అనిపిస్తే వాడు వీడు వరకు ఓకే కానీ ఈ నా కొడుకు లాంటి పదాలు వాడటం సబబు కానే కాదు.  మళ్లీ అల్లు సార్ మీ అనే పదాల పక్కన డాష్ డాష్ పెట్టి మీరే వాఖ్యాన్ని పూరించుకోండి అన్నట్టు అతి తెలివి ప్రదర్శించారు.  ఆర్జీవీ వ్యవహారం చూస్తే లాక్ డౌన్ వలన పని లేక పైత్యం ఎక్కువైనట్టే ఉంది.  

Related Posts

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News