స్టార్ డైరెక్ట‌ర్‌కు హార్ట్ ఎటాక్..అభిమానుల‌లో మొద‌లైన ఆందోళ‌న‌

ఈ ఏడాది ఇండ‌స్ట్రీలో తీర‌ని విషాదాలు ఎన్నో నెల‌కొన్నాయి. రిషీ క‌పూర్ మొద‌లు ఎందరో కొరియోగ్రాఫ‌ర్స్, ప్రొడ్యూస‌ర్స్, డైరెక్ట‌ర్స్ తిరిగిరాని లోకాల‌కు వెళ్ళారు. ప్ర‌ముఖుల మ‌ర‌ణాల‌తో సినీ ప్రేక్ష‌కులు శోక‌సంద్రంలో మునిగారు. 2020 త్వ‌ర‌గా గ‌డిచిపోవాల‌ని అభిమానులు ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ ప్ర‌ముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్ట‌ర్ హార్ట్ ఎటాక్‌తో ఆసుప‌త్రిలో చేరాడ‌ని తెలుసుకున్న అభిమానుల‌కి గుండె ఆగినంత ప‌నైంది. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు పూజాలు చేస్తున్నారు.

వివ‌రాల‌లోకి వెళితే ప్రభుదేవాతో ఏబీసీడీ సినిమా తీసిన డైరెక్ట‌ర్ ఫ్రాన్సిన్ రెమో డిసౌజాకు హార్ట్ ఎటాక్ రావ‌డంతో అత‌న్ని ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ రోజు మ‌ధ్యాహ్నాం స‌మ‌యంలో అత‌నికి హార్ట్ ఎటాక్ రాగా, వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వెంట‌నే యాంజియోగ్ర‌ఫీ చేయ‌డంతో పాటు ఆస్ప‌త్రిలో ఉంచి ప్ర‌త్యేక చికిత్స చేస్తున్నారు. అత‌ని ఆరోగ్యం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వివరాల‌ని హెల్త్ బులిటెన్ ద్వారా విడుద‌ల చేస్తున్నారు వైద్య‌బృందం. అత‌నికి హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌నే విష‌యాన్ని డ్యాన్స‌ర్, కొరియోగ్రాఫ‌ర్ ధ‌ర్మేష్ కూడా ధృవీక‌రించారు

రెమో డిసౌజా రీసెంట్‌గా దిల్ న తోడుంగా అనే మ్యూజిక్ వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో పాటు ఈ మ్యూజిక్ ఆల్బ‌మ్‌ని డిసెంబ‌ర్ 13న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే అనుకోకుండా రెమో హార్ట్‌‌‌ ఎటాక్‌తో ఆస్ప‌త్రిలో చేర‌డంతో అది పోస్ట్ పోన్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తుంది. ప్ర‌భుదేవా హీరోగా రెమో డిసౌజా డైరెక్షన్‌లో ఏబీసీడీ అనే సినిమా వచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వరుణ్ ధావన్, శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్లు. అలాగే, డాన్స్ ప్లస్ అనే రియాలిటీ షోలో సూపర్ జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు.