నాగ చైతన్య, (సామ్ – చై )సమంతల వైవాహిక బంధం మధ్య ఏదో జరుగుతోంది.. త్వరలోనే వీరిద్దరూ విడిపోతారట.. అనే వార్తలు చాలా కాలంగా గుప్పు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ గుప్పు గుప్పు వార్తలపై క్లారిటీ వచ్చేసింది. అవును వాళ్లిద్దరూ విడిపోయారు. అధికారికంగా ప్రకటించేశారు కూడా.
అయితే, వీరిద్దరూ విడిపోవడానికి కారణమిదే అంటూ మరో వార్త కూడా హల్ చల్ చేస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో సమంత నటనపై చాలా రకాల విమర్శలొచ్చాయి అప్పట్లో. ఆ సిరీస్‌లో నటించొద్దని అక్కినేని కుటుంబ సభ్యులు కూడా వారించారట. అవేమీ సమంత పట్టించుకోలేదట.
అప్పటి నుంచే సమంతకు, అక్కినేని ఫ్యామిలీతో అలాగే, చైతూతో విబేధాలొచ్చాయని అంటున్నారు. అయితే, సినీ నేపథ్యమున్న ఫ్యామిలీ అయిన అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇలాంటి అభ్యంతరాలు వచ్చాయంటే, అది నమ్మే విషయం కాదు. గతంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని మేనకోడలు సుప్రియ కూడా తెరంగేట్రం చేసింది. ఆమె కూడా అభ్యంతరకర (హాట్ సీన్స్) సన్నివేశాల్లో నటించింది.
సో అక్కినేని ఫ్యామిలీపై ఆ తరహా ఆరోపణలు చేయదగ్గవి కావు. కానీ, చై,సామ్ విడిపోవడం అనేది వారి వ్యక్తిగత విషయం. విడిపోయారంతే. ఏది ఏమైతేనేమి.. మొత్తానికి ఇన్ని రోజుల సస్పెన్స్‌కి ఈ రోజు తెర పడిందంతే.