అక్కడ జనసేనదే హవా..  వైసీపీ మంత్రి వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాడట ?

గత ఎన్నికల్లో జనసేన గెలిచినా ఒకే ఒక్క స్థానం రాజోలు నియోజకవర్గం.  పవన్ రెండు చోట్లా ఓడిపోయినా రాపాక వరప్రసాద్ మాత్రం రాజోలు నుండి విజయం సాధించింది అందరి దృష్టినీ ఆకర్షించారు.  జనసేనకు శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తూఇన్న మొట్టమొదటి, ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు దక్కింది.  కానీ కొద్దిరోజులకే ఆయన వైసీపీకి జైకొట్టారు.  పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా జగన్ ను కీర్తిస్తూ నియోజకవర్గంలో పాలాభిషేకాలు లాంటివి చేశారు.  దీంతో జనసేన ఆయన్ను దూరం పెట్టేసింది.  

Razole YSRCP cadres upset with minister,Razole
Razole YSRCP cadres upset with minister,Razole

అనధికారికంగా ఆయన వైసీపీ ఎమ్మెల్యే అయిపోయారు.  రాజోలులో తనది సపరేట్ వైసీపీ వర్గమని చెప్పుకుంటుంటారు రాపాక.  ఇక వైసీపీలో ఆయనకు ఎంత మేరకు స్థానం ఉందో చెప్పలేం కానీ నియోజకవర్గంలో మాత్రం ఆయన హవానే కనిపిస్తోంది.   ఎమ్మెల్యే కావడం మూలానో ఏమో కానీ వైసిపీ మంత్రి కూడ ఆయనకే ఎక్కువ వికలువ ఇస్తున్నారట.  మొన్నామధ్యన్ కేబినెట్ మినిస్టర్ ఒకరు రాజోలు వెళ్ళినప్పుడు అక్కడి వైసీపీ ఇంఛార్జిని కలవకుండా నేరుగా జనసేన ఎమ్మెల్యే రాపాక వద్దకు వెళ్లడం కలకలం రేపుతోంది.  అంతేకాదు పనులన్నింటికీ రాపాకను, ఆయ్న ఆవర్గాన్నే వెంటేసుకుని తిరిగారట.  

Razole YSRCP cadres upset with minister,Razole
Razole YSRCP cadres upset with minister,Razole

ఇప్పటికే రాపాక ఎంట్రీతో రాజోలు వైసీపీలో అగ్గి రాజుకుంది.  ప్రత్యర్థిని పక్కన పెట్టుకుంటే ఇక తమకు ఏం విలువ ఉంటుందని వాపోతున్నారు మొదటి నుండి వైసీపీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు.  అసలు మంత్రి నియోజకవర్గంలోకి వస్తే అధికార పార్టీ శ్రేణులను కలవాలి, పనులేమన్న ఉంటే   వారి ద్వారానే జరుపుకోవాలి కానీ ఇలా పూర్తిగా పక్కనపెట్టేస్తారా అంటూ రగిలిపోతున్నారు.  వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడికి టికెట్ దొరుకుతుందో లేదో అనే అనుమానంలో ఉన్న వైసీపీ శ్రేణులు ఇదే రిపీట్ అయితే నియోజకవర్గంలో పార్టీ కనుమరుగవడం ఖాయమంటున్నారు.