ram charan : ఉక్రెయిన్ లో ఒక్కసారి తనకి వర్క్ చేసినందుకే రామ్ చరణ్ గొప్ప సాయం!

ram charan : ప్రస్తుతం భారీ హైప్ తో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి వస్తున్న భారీ సినిమాల్లో ఒకటి “ట్రిపుల్ ఆర్(RRR)”. దర్శక దిగ్గజం రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో భారీ స్కేల్ లో తీసిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి భారీ సెట్స్ వేసి మన దేశంలోనే యితర దేశాల్లో కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
మరి వాటిలో ఇప్పుడు తీవ్ర యుద్ధంలో నష్టపోయిన దేశం ఉక్రెయిన్ కూడా ఒకటి. ఈ సినిమాలో కీలక సన్నివేశాలు కొన్ని మరియు “నాటు నాటు” సాంగ్ ని చిత్ర బృందం అక్కడే తెరకెక్కించారు. అయితే ఈ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కి పర్సనల్ బాడీ గార్డ్ గా కైన్ అనే వ్యక్తి కొన్ని రోజులు అతడి దగ్గర పని చేసాడు.
అయితే ఇప్పుడు అక్కడి యుద్ధ నేపథ్యంలో రామ్ చరణ్ కైన్ కి ఫోన్ చేసి యోగ క్షేమాలు కనుక్కున్నారని అతడే ఒక వీడియో చేసి ధన్యవాదాలు తెలిపాడు. అంతే కాకుండా చరణ్ తమకి సాయం చేసాడని. తన కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చడమే కాకుండా మెడిసిన్స్ కూడా పంపారని..
ఇంకా ఏ అవసరం ఉన్నా తనని అడగమని చెప్పారని కైన్ ఆ వీడియోలో తెలిపాడు. దీనితో కేవలం కొన్ని రోజులు మాత్రమే పని చేసిన తన బాడీ గార్డ్ పట్ల చరణ్ చూపిన శ్రద్ధ తో అతడి అభిమానులు గర్వం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది.
https://twitter.com/shreyasgroup/status/1504857219921166339?s=20&t=TWHvRu2DMw-sp1jgFgTe6A