Rahul Gandhi : రాహుల్ గాంధీ ఎపిసోడ్: టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయ్.!

Rahul Gandhi

Rahul Gandhi Episode : స్నేహితురాలి పెళ్ళి విందుకి హాజరైతే అది పెద్ద నేరమా.? కాంగ్రెస్ నేత, భావి ప్రధానిగా పిలవబడుతున్న రాహుల్ గాంధీ విషయంలో ఎందుకింత రాద్ధాంతం జరుగుతోంది.? సరే, రాజకీయాల్లో ప్రజా సేవ అన్న ఆలోచన పక్కన పెట్టి, రాద్ధాంతమే రాజకీయం అన్నట్టు రాజకీయ పార్టీలు వ్యవహరించడం కొత్తేమీ కాదు.

ఔను, రాహుల్ గాంధీ పెళ్ళి విందులో పాల్గొన్నారు.. దీన్ని రాద్ధాంతం చేయడం వల్ల వచ్చే వీసమెత్తు లాభమేంటో ఆలోచించుకోకుండా బీజేపీ, టీఆర్ఎస్ చెత్త రాజకీయం చేశాయంటే, ఆయా పార్టీలు రాహుల్ గాంధీని చూసి ఎంతలా బయపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి, రాహుల్ గాంధీని చూసి భయపడాల్సిన అవసరం బీజేపీ, టీఆర్ఎస్‌లకి లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వున్నాగానీ, ఆ పార్టీకి గులాబీ పార్టీని గట్టిగా ఢీకొనే సత్తా లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతిపక్షం.. అయినా, రాహుల్ రాజకీయాలకు బీజేపీ భయపడే అవకాశమే లేదు.

ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ.. రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియోలతో యాగీ చేయడమంటే, కాంగ్రెస్ పార్టీ స్థాయికి తమ స్థాయిని ఆ రెండు పార్టీలూ దిగజార్చేసుకున్నాయనే కదా అర్థం.? మొన్నామధ్య రాహుల్ గాంధీ మీద ఎవరో విమర్శలు చేస్తే, ‘అది తప్పు..’ అని స్వయానా కేసీయార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అప్పుడు కేసీయార్‌కి వున్న సోయ, ఇప్పుడెందుకు గులాబీ పార్టీ కోల్పోయింది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక్కటి మాత్రం నిజం.. సోకాల్డ్ వీడియో పుణ్యమా అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్ల సింపతీ పెరిగింది. గులాబీ పార్టీ, కాషాయం పార్టీ.. రెండూ ఒక్కటేనని తేలిపోయిందిప్పుడు.