Rahul Gandhi Sabha: ‘రైతు సంఘర్షణ సభ’ పేరుతో తెలంగాణలో రాహుల్ గాంధీ సభ!

Rahul Gandhi Sabha: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ మే 6 న తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ లో పర్యటించనున్నాడు. ‘రైతు సంఘర్షణ సభ’ అనే పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇక మే 7న హైదరాబాద్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సభలో వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై చర్చలు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న డ్రామా లను ప్రజలకు తెలియజేసేలా ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా రైతులను ఆదుకోవడంలో.. వారికి అండగా తమ పార్టీ ఉందని తెలియజేయడానికి ఈ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.