Pruthvi raj: మరోసారి వైసీపీ పై బూతులతో రెచ్చిపోయిన పృథ్వీరాజ్…. ఇక సినిమా పోయినట్లేనా?

Pruthvi raj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ ఇటీవల లైలా సినిమా వేడుకలో భాగంగా పరోక్షంగా వైసిపిని ఉద్దేశించి ఈయన చేసిన కామెంట్లు వైకాపా కార్యకర్తలను పూర్తిస్థాయిలో ఆగ్రహానికి గురి చేశాయి దీంతో ఒక్కసారిగా కధం తొక్కిన వైసీపీ సోషల్ మీడియా బాయ్ కాట్ లైలా మూవీ అంటూ ఒక హాష్ ట్రెండ్ చేశారు. దాదాపు లక్షకు పైగా ట్వీట్లు రావడంతో ఈ సినిమాపై పూర్తిస్థాయిలో నెగిటివిటీ ఏర్పడింది.

ఇలా ఈ సినిమా గురించి నెగిటివిటీ రావడంతో విశ్వక్ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ… ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన కేవలం సినిమాలో ఒక పాత్రలో నటించారు అయితే ఆయన వేదికపై ఇలాంటి మాటలు మాట్లాడుతున్న సమయంలో మేము అక్కడ లేమని తెలిపారు. చిరంజీవి గారు వస్తున్నారని తెలిసి నేను ప్రొడ్యూసర్ గారు తనని ఇన్వైట్ చేయడం కోసం వెళ్ళామని ఆ సమయంలో మేము అక్కడ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని తెలిపారు.

ఆ వ్యక్తి అలా మాట్లాడాడని ఎంతోమంది కష్టాన్ని చంపేయడం కరెక్ట్ అయినది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మా సినిమాను చంపేయొద్దు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ విశ్వక్ క్షమాపణలు కూడా చెప్పారు. ఇలా ఇంత పెద్ద వివాదం జరుగుతున్నప్పటికీ కూడా పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పకపోగా మరోసారి వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించిన నేపథ్యంలో వైసీపీ ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోతున్నారు.

పృధ్విరాజ్ కి వివాదం కారణంగా అధిక రక్తపోటుకు గురై హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రి బెడ్ మీది నుంచే మీడియాతో మాట్లాడిన పృధ్వీ.. మరోసారి బూతులతో రెచ్చిపోయారు. వైసీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. 11 అనే మాట వస్తేనే వైసీపీ వాళ్ళు గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. నా తల్లిని కూడా బూతులతో తిడుతున్నారంటూ ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు పృధ్వీ సారీ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. దమ్ముంటే ట్రోలర్స్ ముందుకు రావాలని సవాల్ విసిరారు. చూస్తుంటే ఈ వివాదం ఇంతటితో ఆగేలా లేదు అనిపిస్తోంది. ఇక పృధ్వీరాజ్ క్షమాపణలు చెప్పకుండా మరోసారి వైసిపి వారిపై రెచ్చిపోవడంతో వైకాపా అభిమానులు ఈ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాము ఈ సినిమాని ఎవరు కాపాడలేరు అంటూ ఈ చిత్రాన్ని టార్గెట్ చేశారు. ఇలా పృధ్విరాజ్ వైసీపీ అభిమానుల మధ్య ఒక సినిమా వివాదంలో చిక్కుకొని ఇబ్బందులకు గురి అవుతుందని చెప్పాలి.