‎Srikanth Iyengar: గాంధీ గురించి అసభ్యకర కామెంట్స్ చేసిన నటుడు శ్రీకాంత్.. స్త్రీలోలుడు అంటూ!

Srikanth Iyengar: టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. అయితే ఈయన సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల వల్ల హైలెట్ అయ్యారు. తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు శ్రీకాంత్. మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‎అసభ్యకరంగా మాట్లాడారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో గాంధీ అభిమానులు శ్రీకాంత్ అయ్యంగార్ పై మండిపడుతున్నారు. ఆ వీడియోలో శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2న ఒక నటుడు గాంధీని ఎదో అన్నాడని అతన్ని ట్రోల్ చేశారు. ఎం తెలుసు మీకు గాంధీ గురించి. ఆయన మ‌హాత్ముడు కాదు. స్త్రీలోలుడు.



‎ ఏంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు. మేము భరతమాత అంటాం. అలాంటిది గాంధీ జాతిపిత ఎలా అయ్యాడు అంటూ తీవ్రంగా స్పందించాడు. దాంతో ఆయనపై గాంధీ మద్దతుదారులు మండిపడుతున్నారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం శ్రీకాంత్ కీ మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.