‎Varun Sandesh: పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి.. హీరో వరుణ్ సందేశ్ కామెంట్స్ వైరల్!

‎Varun Sandesh: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక కలిసి నటించిన చిత్రం కానిస్టేబుల్. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ ఈ సినిమాను నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీకి మరో రెండు రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

‎అందులో భాగంగానే హైదరాబాద్‌ లోని ప్రసాద్ ల్యాబ్‌ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వ‌హించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నా కెరీర్‌ లో అక్టోబ‌ర్ నెల‌ను మ‌రిచిపోలేను. 18 ఏళ్ల క్రితం నేను న‌టించిన నా మొద‌టి చిత్రం హ్యాలీడేస్ 2007 అక్టోబ‌ర్ నెల‌లోనే విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించి నా కెరీర్‌నే మ‌లుపు తిప్పింది. అందుకె అక్టోబ‌ర్ నెల నా జీవితంలో గుర్తుండిపోతుంది.

‎ఇప్పుడు కానిస్టేబుల్ సినిమా కూడా ఇదే నెల‌లో విడుద‌ల అవుతుండ‌డంతో ఆ రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి అని చెప్పుకొచ్చారు వరుణ్. స‌మాజంలో జ‌రుగుతున్న అంశాల ప్రేర‌ణ‌తో ఈ చిత్రాన్ని మ‌ల‌చ‌డం జ‌రిగింది అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని హీరో వరుణ్ సందేశ్ తో పాటు మూవీ మేకర్స్ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి..