తెలంగాణ రాష్ర్టం హైదరాబాద్ జీహెచ్ ఎంసీ ఫరిదిలో ప్రజలు కరోనాతో బెంబేలెత్తిపోతున్న సంగతి తెలిసిందే. రోజు 1500కు పైగా కేసులు నమోదవ్వడంతో పరిస్థితి ఎంత తారుణంగా ఉందో అద్ధం పడుతోంది. అయితే ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న ప్రచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా అంటుకుందని..దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు రెండు, మూడు రోజులుగా మీడియా కథనాలు ఒకటే వేడెక్కిస్తున్నాయి. ఓ ప్రముఖ పత్రిక కూడా కేసీఆర్ కరోనా పాజిటివ్ అని ప్రచురించడంతో..ఆయనకు నిజంగానే కరోనా అని ఆ ప్రచారానికి మరింత బలం దొరికింది.
దీంతో సోషల్ మీడియాలో కథనాలు అంకంతకు వేడెక్కించాయి. కేసీఆర్ అభిమానులు, ఆయన ఫాలోవర్స్ ఆందోళన చెందుతున్నట్లు? కథనాలొచ్చాయి. ఇలియాస్ అనే టీఆర్ ఎస్ కార్యకర్త ఒకరు ఈ రూమర్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. కేసీఆర్ కు కరోనా లేదని ఇలియాస్ చెప్పే ప్రయత్నం చేసాడు. తాజాగా ఈ ప్రచారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు. కేసీఆర్ కు కరోనా సోకలేదని, తప్పుడు వార్తలు ప్రచారం చేయోద్దని విజ్ఞప్తి చేసారు. అలాగే ఆ పత్రిక ఎడిటర్ పై కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆ పత్రిక యాజమాన్యం కేసీఆర్ ప్రభుత్వం కక్ష పూరితంగానే వ్యవహరించి అరెస్ట్ కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేసీఆర్ ఆరోగ్య విషయంపై స్పందించాల్సింది ఆయన కుటుంబ సభ్యులని…కాకపోతే కేసీఆర్ పక్కన ఉండే ఉన్నత అధికారులని…అంతేగానీ పోలీస్ శాఖకు చెందిన దిగువ స్థాయి సిబ్బంది స్పందించి అరెస్ట్ కు పాల్పడటం అన్యాయమంటూ మండిపడుతోంది. కేసీఆర్ కు నిజంగా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే హైదరాబాద్ లో పరిస్థితి అంత దారుణంగా ఉంటే? ఎక్కడికి వెళ్లారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ తీరుపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, బీజేపీ సంచలన విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా విఫలమైందని..సర్కార్ సామన్య ప్రజల ప్రాణాలు గాలి కొదిలేసిందని మండిపడ్డాయి.