టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏది చేసినా రాజకీయమే. ప్రజలకు కనబడేలా పని చేయాలి అనుకుంటే దానికి బోలెడంత పబ్లిసిటీ రావాలని కోరుకుంటారు. ఈ పబ్లిసిటీ కోసం ఇది అది అని లేకుండా అన్ని విషయాలను వాడేసుకుంటారు. అలా వాడుకున్న అంశమే ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం. చరిత్రలో ఆంధ్రాకంటూ ఒక తేదీని అవతరణ దినోత్సవంగా పరిణగిస్తూ వచ్చారు. ప్రతి యేటా నవంబర్ 1ను అవతరణ దినోత్సవంగా జరుపుకున్నారు. కానీ రాష్ట్రం విడిపోయాక నవంబర్ 21న జరపాలా లేదా అనే మీమాంస ఏర్పడింది. నిజానికి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయింది. కాబట్టి కొత్త అవతరణ తేదీ వారికి వర్తిస్తుంది. మనకు కాదు.
కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రం విడిపోయిన జూన్ 2వ తేదీకి అపాయింట్ డే అని పేరు పెట్టి వరుసగా వారం రోజులు అంటే జూన్ 8వ తేదీ వరకు మాడిపోయిన మొహాలతో ఏదో సర్వం కోల్పోయినట్టు, ఈ రోజు మనకు దుర్దినం అన్నట్టు నవనిర్మాణ దీక్షలు చేపడుతూ ఆ వారం జనాన్ని బాధపడమని ప్రోత్సహించేవారు. అంతేకానీ నష్టపోయినా దిగులుచెందక ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పింది లేదు. ఆంధ్రప్రదేశ్ అలాగే ఉందని, తెలంగాణ మాత్రమే పక్కకు వెళ్లిందని నచ్చజెప్పే ప్రయత్నం చేయలేదు. జనం ఎంత బాధపడితే అంత మైలేజ్ అనుకున్నారు. ఐదేళ్ల పాటు అదే ఫాలో అయ్యారు.
కానీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ ఏడుపుగొడ్డు విధానానికి స్వస్తి పలికారు. నవనిర్మాణ దీక్షల పేరుతో ఏడుస్తూ కూర్చోవాల్సిన పనిలేదని చెప్పి మనం ఎప్పటిలాగే నవంబర్ 1న తేదీనాడే అవతరణ దినోత్సవం జరుపుకుందామని జీవో రిలీజ్ చేశారు. ఆయన ఆదేశాలు మేరకు రాష్ట్రం మొత్తం నవంబర్ 1న అవతారం దినోత్సవాలను జరుపుకుని పూర్వపు అనుభూతిని పొందింది. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం నవంబర్ 1న అవతరణ దినోత్సవంగా అంగీకరించినట్టు లేదు. ఇది చూసిన జనం మరీ ఇంత కుంచిత బుద్ధి ఏమిటని, ఈ చిన్న విషయంలో కూడ జగన్‌తో సరితూగలేకపోయారే అంటున్నారు.