Ntr: అన్ని విషయాలలో డేర్ చేసే ఎన్టీఆర్ కు ఆ విషయంలో మాత్రం అంత భయమా… వెనకడుగు వేస్తాడా?

Ntr: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఎన్టీఆర్ ఒకరు. బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ అనంతరం అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే ఏ విషయాన్ని అయినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే ఈయన మాట తీరు కూడా అదే విధంగా ఉంటుంది. ఏ విషయమైనా నిర్మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ నటన గురించి ఆయన చెప్పే డైలాగ్ గురించి ఇక డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఏ విషయాన్ని అయినా అలా చూసి ఇలా నేర్చుకునే టాలెంట్ ఎన్టీఆర్ కి ఉంది.

ఇలా అన్ని విషయాలలో డేర్ చేసే ఈయన ఒక విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తారని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ అంతలా భయపడే ఆ విషయం ఏంటనే విషయాన్నికి వస్తే అది మరేదో కాదు అమ్మాయిలే అని చెప్పాలి. ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్లో అందరితో చాలా సరదా సరదాగా గడుపుతుంటారు కానీ హీరోయిన్స్ తో మాత్రం అంత తొందరగా మింగిల్ కాలేరట. చాలామంది హీరోలు హీరోయిన్లను ఇంటికి కూడా ఆహ్వానిస్తూ ఉంటారు కానీ ఎన్టీఆర్ మాత్రం అలాంటి సాహసం చేయరని తెలుస్తుంది.

చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ ను అమ్మాయిలకు తన తల్లి కాస్త దూరంగా పెంచారు అందుకే అమ్మాయిలే విషయంలో ఎన్టీఆర్ మాత్రం చాలా పద్ధతిగా ఎంత లిమిట్స్ లో ఉండాలో అంతవరకే ఉంటారు తప్ప అతిగా మాట్లాడరని తెలుస్తోంది. ఎన్టీఆర్ పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే.