YS Jagan: వైయస్ జగన్ హత్యకు కుట్రలు జరుగుతున్నాయా…. అందుకే భద్రత తగ్గించారా?

YS Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అంటే అవుననే చెబుతున్నారు వైసీపీ కార్యకర్తలు. ఒక మాజీ ముఖ్యమంత్రికి పూర్తిస్థాయిలో భద్రత ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డికి భద్రతను పూర్తిస్థాయిలో తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయన వెంట కనీసం ఇద్దరూ కానిస్టేబుల్స్ కూడా కనిపించడం లేదు దీంతో వైసిపి అభిమానులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉంటే ఎప్పటికైనా తమకు తమ పార్టీకి ప్రమాదమే అని భావించిన కూటమి నేతలు తన హత్యకు ప్లాన్ చేస్తున్నారంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే భారీ జన సందోహం వస్తుందన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి భద్రతను పొదించడం వెనక కారణం ఏంటో స్పష్టమవుతుందని భావిస్తున్నారు.

ఇలా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం కూటమినేతలు మట్టిలో కలిసిపోవడం ఖాయమని వారి అంతూ చూస్తాము అంటూ కూడా కొంతమంది వార్నింగ్ ఇస్తున్నారు.వాస్తవంగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి నిబంధనల ప్రకారం 139 మందితో భద్రత కల్పించాలని అంటున్నారు. కానీ 58 మందితో మాత్రమే భద్రత కల్పించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

గత రెండు రోజుల క్రితం ఈయన శ్రీకాకుళం విజయవాడ గుంటూరు ప్రాంతాలలో పర్యటనలు చేశారు. అయితే ఆయన దరిదాపుల్లో కూడా సెక్యూరిటీ కనిపించకపోవడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటిస్తే కనీస భద్రత కూడా కల్పించకపోవడం అలాగే సరైన వాహనాలు కూడా ఆయనకు ఇవ్వకపోవడం వెనక కూటమినేతల కుట్ర అర్థమవుతుందంటూ వైసీపీ అభిమానులు కార్యకర్తలు జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.