ఇండస్ట్రీ టాక్ : “NTR30” పై ఫ్యాన్స్ కి మరింత డిజప్పాయింట్మెంట్!

పాన్ ఇండియా భారీ హిట్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) చిత్రం తో హీరోలు రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకి భారీ ఫేమ్ వచ్చింది. దీనితో నెక్స్ట్ రామ్ చరణ్ అయితే శంకర్ లాంటి దర్శకుడుతో సినిమా ఆల్రెడీ పూర్తి చేయవస్తుండగా ఎన్టీఆర్ మాత్రం ఇంకా అలా హోల్డ్ లోనే ఉన్నాడు.

పైగా తన లుక్ కూడా ఎప్పటికప్పుడు మారుస్తుండడంతో సినిమా ఇదిగో స్టార్ట్ అవుతుంది. అదుగో స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే సినిమా అయితే అసలు ప్రోగ్రెస్ లేకుండా పోయింది. దీనితో ఫ్యాన్స్ కూడా క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ కి మరింత డిజప్పాయింట్ చేసే వార్త వినిపిస్తుంది.

ఈ సినిమా అయితే ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదట. మరి ఎంత లేదన్న కూడా రెండు మూడు నెలల వరకు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ లేదట. దీనితో ఈ చిత్రం విషయంలో మాత్రం తన ఫ్యాన్స్ కి దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పి తీరాలి.

ఇంకా హీరోయిన్ కూడా ఎవరు అనేది ఫిక్స్ కాకపోవడం మరో తలనొప్పిగా మారింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారు.