ప్రస్తుతం సినీ పరిశ్రమలో వారసుల హవా నడుస్తుంది. ఇప్పటికే చాలా మంది వారసులు వెండితెరకు ఎంట్రీ ఇవ్వగా, ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీకి సంబంధించి పలు ప్రచారాలు జరుగుతున్నప్పటికీ దీనిపై ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రస్తుతం జోరుగా ప్రచారం నడుస్తుంది.
తన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పక్కాగా ఉంటుందని బాలయ్య చెబుతున్నాడే తప్ప అది ఎప్పుడు అనేది మాత్రం కన్‌ఫాం చేయడం లేదు. తాజా సమాచారం ప్రకారం బాలయ్య తన బర్త్‌డే ( జూన్ 10) రోజు మోక్షజ్ఞ సినిమాను లాంచ్ చేయనున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే రంగం సిద్ధమైందని,డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడని జోరుగా ప్రచారం నడుస్తుంది. మరి మోక్షజ్ఞను పరిచయం చేసే ఆ దర్శకుడు మరెవరో కాదు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. చిరంజీవి తనయుడిని వెండితెరకు పరిచయం చేసిన పూరీ ఇప్పుడు బాలయ్య తనయుడి తొలి సినిమాను డైరెక్ట్ చేయనున్నట్టు టాక్.
మోక్షజ్ఞ తొలి చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో రూపొందనుందని, ఇందుకు సంబంధించి పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవుతుందని ఇన్‌సైడ్ టాక్. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ ఆ మధ్య ఏదో వేడుకలో కనిపించినప్పుడు చాలా లావుగా ఉన్నాడు. మరి ఆ పర్సనాలిటీ తగ్గించాలంటే చాలా రోజులు పడుతుంది. జూన్ 10నే సినిమా లాంచింగ్ అంటే ఆ సమయానికి మోక్షజ్ఞ తగ్గి స్లిమ్‌లోకి వస్తాడా అనేది అందరిలో అనుమానాలు రేకెత్తిస్తుంది. ఎప్పటి నుండి మోక్షజ్ఞ ఎంట్రీపై భిన్న కథనాలు వస్తుండగా, ఈ సారైన ఆ వార్తలు నిజం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.