అక్కడ మరింత పడిపోతున్న “వీరసింహ రెడ్డి” కలెక్షన్స్.!

filmcompanion_2023-01_9e0e600b-610a-402d-a21c-a03567b1ceb1_Review_Lead__Veera_Simha_Reddy__1

నందమూరి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా “వీరసింహా రెడ్డి” అనేక అంచనాలు నడుమ రిలీజ్ అయ్యింది. అలాగే హైప్ కి తగ్గట్టే మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ఈ చిత్రం అందుకోగా అనుకోని విధంగా రెండో రోజు నుంచే ఓ ఏరియా ఓ మాత్రం భారీగా వసూళ్లు డ్రాప్ అవ్వడం నందమూరి ఫ్యాన్స్  లో ఆశ్చర్యంగా మారింది.

మరి ఆ ఏరియా యూఎస్ లో కాగా అక్కడ వీరసింహా రెడ్డి ఈ తక్కువ వసూళ్లతోనే కంటిన్యూ అవుతున్నట్టుగా ట్రేడ్ నుంచి లేటెస్ట్ సమాచారం. మరి ఇతర చిత్రాలు 50 వేల కి పైగానే డాలర్స్ ని సింగిల్ డే ఓ రాబడుతూ ఉండగా వీరసింహా రెడ్డి కేవలం 30 వేల లోపే అందుకుంది.

దీనితో సినిమాకి స్టార్టింగ్ లో ఉన్న హైప్ కి ఇప్పుడు నమోదు అవుతున్న వసూళ్లకు ఎంత వ్యత్యాసం ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాకి జరిగిన బిజినెస్ మార్క్ ని వీర సింహా రెడ్డి అక్కడ టచ్ చేసేయగా ఇప్పుడు తక్కువ వస్తున్నప్పటికీ ఇవన్నీ లాభాలే అని చెప్పాలి.

ఇక ఈ సినిమాని గోపీచంద్ మలినేని దర్సకత్వం వహించగా హానీ రోస్ మరియు శృతి హాసన్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే థమన్ సంగీతం సమకూర్చాడు. అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహించి ఈ సంక్రాంతి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.