పవన్ పై సెటైర్ వేసిన బాలయ్య.. ??

pawan-kalyan-and-trivikram-srinivas-to-start-balakrishna-unstoppable-2_b_1809220229

ప్రస్తుతం తెలుగులో సినిమాలో రాజకీయాలు సినిమాలు కలిసే ఉంటున్నాయి అని అందరికీ తెలిసిందే. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రాజకీయ నాయకులూ సినిమాలు వాడుకొని తమ మైలేజ్ పెంచుకునే పనిలో ఉన్నారు. అయితే ఇపుడు టాలీవుడ్ నుంచి స్టార్స్ అయ్యి సినిమాల్లో ఉన్న వారిలో అయితే టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కూడా ఒకరు.

మరి ఈ ఇద్దరి కలయిక అనేది చాలా మందిలో ఊహించనిది. కానీ ఫైనల్ గా ఈ మధ్య కాలంలో బాలయ్య టాక్ షో లో స్క్రీన్ పంచుకున్నారు. ఇక ఈ తర్వాత తాము పొలిటికల్ గా కలిసి పని చేస్తున్నారు. అయితే ఇవాళ తమ పార్టీల కలయిక మీటింగ్ లో బాలయ్య పవన్ పై వేసిన సెటైర్ లాంటిది వైరల్ గా మారింది. ఇప్పుడు పవన్ సినిమాలు పక్కన పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.

ఐతే ఈ మీటింగ్ లో సోదరుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో తక్కువ కనిపిస్తున్నాడు రాజకీయ సభల్లో రోడ్ల మీదనే కనబడుతున్నాడు అని అన్నారు. దీనితో బాలయ్య మళ్ళీ పవన్ సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఇపుడు బాలయ్య తన కెరీర్ లో 109వ సినిమా చేస్తుండగా పవన్ మొత్తం మూడు భారీ సినిమాలు చేస్తున్నాడు.