Acharya Completed Censor : బిగ్ అప్డేట్ : “ఆచార్య” కి అల్టిమేట్ ఏక్షన్ సర్టిఫికెట్.. ఇక మోత మొదలు.!

Acharya Completed Censor

Acharya Completed Censor : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా “ఆచార్య”. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటంచగా తనకి హీరోయిన్ గా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే నటించింది.

మరి ఎట్టకేలకు భారీ హంగులతో రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమాకి నిన్ననే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి అని మేము తెలిపాము. అలాగే సినిమా రిజల్ట్ ఏంటో కూడా చెప్పేసాము. మరి ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పై చిత్ర యూనిట్ బిగ్ అప్డేట్ అందించారు. ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకోగా సెన్సార్ బృందం ఈ సినిమాకి గాను యు/ఏ సర్టిఫికెట్ ని ఇచ్చినట్టుగా తెలియజేసారు.

మరి దీనిని అల్టిమేట్ ఏక్షన్ అంటూ ఇంగ్లీష్ లో సాలిడ్ మార్క్ తో అనౌన్స్ చేశారు. అలాగే దీనిపై మెగాస్టార్ ది ఒక పవర్ ఫుల్ మాస్ పోస్టర్ తో రిలీజ్ చేసి మరింత ఆసక్తి పెంచేసేసారు. ఇక అల్రెడీ ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు తన గొంతు ఇచ్చినట్టుగా కన్ఫర్మ్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ భారీ సినిమాకి మణిశర్మ సంగీతం అందివ్వగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.