‘చిరు’ ఛాన్స్: అప్పుడు తమన్నా ఇప్పుడు సాయి పల్లవి

Sai Pallavi To Turn Chiranjeevis Dream Into A Reality | Telugu Rajyam

చిరంజీవి మాటిచ్చారంటే తప్పకుండా నిలబెట్టుకుంటారు.. అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొడుకు రామ్ చరణ్‌ నటించిన ‘రచ్చ’ సినిమా ఫంక్షన్‌లో హీరోయిన్ తమన్నాకోరిక మేరకు ఆమెకి మాటిచ్చాడు. ఆ మాటను గుర్తు పెట్టుకుని, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో తమన్నాకి ఛాన్స్ ఇచ్చాడు. అలాంటి ఛాన్సే ఇప్పుడు ఫిదా బ్యూటీ సాయి పల్లవి దక్కించుకుంది.

‘లవ్ స్టోరీ’ సినిమా ఫంక్షన్ సందర్భంగా సాయి పల్లవికి చిరంజీవి మాటిచ్చారట. ఆ మాట త్వరలోనే నెరవేర్చే దిశగా చిరంజీవి ఆలోచన కూడా చేస్తున్నారట. ఆల్రెడీ చిరంజీవితో కలసి నటించే ఛాన్స్ సాయిపల్లవికి వచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో చెల్లెలి పాత్రకు మొదటగా సాయి పల్లవినే అనుకున్నారు. కానీ, ఆ పాత్రను సాయి పల్లవి తిరస్కరించగా కీర్తి సురేష్‌కి ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కింది.

ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు సాయి పల్లవి భారీ మూల్యమే చెల్లించుకోవల్సి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా అనేక రకాల ట్రోల్స్ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితేనేం, మరోసారి ఛాన్స్ కొట్టేసింది. సాయి పల్లవి డాన్సులకు మెస్మరైజ్ అయిన చిరంజీవి, తానే స్వయంగా సాయి పల్లవితో కలసి స్టెప్పులేయాలనుకుంటున్నానని చెప్పడంతో, సాయి పల్లవి తాను మిస్ చేసుకున్న ఛాన్స్ మళ్లీ దక్కించుకుంటానన్ననమ్మకంతో ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బవుతోందట. ఎప్పుడెప్పుడా ఆ ఛాన్స్ అని ఈగర్‌గా ఎదురు చూస్తోందట. త్వరలోనే సాయి పల్లవి కోరిక నెరవేరబోతోందని తాజా టాక్. ఇంతకీ చిరుతో కలిసి సాయి పల్లవి ఏ సినిమాలో నటించబోతోంది.? తెలియాలంటే ఇంకాస్త టైమ్ వేచి చూడాల్సిందే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles