త్రివిక్రమ్ కి షాకిచ్చిన మహేష్ నయా కామెంట్స్..!

Mahesh Babu Shocking Comments To Trivikram | Telugu Rajyam

టాలీవుడ్ ఎవర్ చార్మ్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. టాలీవుడ్ లో ఉన్నా బాలీవుడ్ హాలీవుడ్ లెవెల్ కటౌట్ మహేష్ బాబు సొంతం. తన లుక్ తో ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ చూపించగల నటుడు మహేష్. అందుకే మహేష్ నుంచి ఓ అదిరే సినిమా నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చూడాలని ఎప్పుడు నుంచో మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనిపై దిగ్గజ దర్శకుడు రాజమౌళితో సినిమా ఓకే అయ్యి సమాధానం దొరికింది.

అయితే ఈ భారీ సినిమా కంటే ముందే మహేష్ ని పాన్ ఇండియన్ లెవెల్లో పరిచయం చేస్తున్నట్టుగా త్రివిక్రమ్ యూనిట్ తెలిపారు. దర్శకుడు నాగ వంశీ తో త్రివిక్రమ్ మహేష్ ల హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. పైగా రాజమౌళి సినిమా కంటే ముందే ఈ చిత్రం రానుంది. సో మహేష్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా త్రివిక్రమ్ తోనే ఫిక్స్ అయ్యింది.

కానీ నిన్న మహేష్ చేసిన కామెంట్స్ త్రివిక్రమ్ కి షాకిచ్చేలా ఉన్నాయి. నేను సరైన టైం లోనే సరైన సినిమాలు చేస్తాను. అలా రాజమౌళితో నా ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాని చెప్పాడు. అంటే త్రివిక్రమ్ సినిమాని ఇంకా మహేష్ దృష్టిలో పాన్ ఇండియన్ సినిమా కాదా అన్న అనుమానం మొదలయ్యింది. ఏది ఏమైనప్పటికీ మహేష్ నయా కామెంట్స్ మాత్రం కాస్త షాకింగ్ గానే ఉన్నాయని చెప్పాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles