తరచూ మలబద్ధకం సమస్య వేధిస్తోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సమస్యకు చెక్!

main_avoidthesefoodstostopconstipationinwinter

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో మలబద్ధకం ఒకటి. ఒకసారి ఈ సమస్య బారిన పడితే మాత్రం జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల చాలామంది నరకం అనుభవిస్తామని చెబుతున్నారు. వేర్వేరు కారణాల వల్ల ఈ సమస్య బారిన పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

తరచూ ఈ సమస్య వేధిస్తుంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకూంటే మంచిది. ఈ సమస్య దీర్ఘకాలంలో ఇతర ప్రమాదకర వ్యాధులకు కారణమవుతుంది. ఈ సమస్య వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు పైల్స్‌, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. డైట్ లో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది.

దోసకాయ, పెసర గింజలు తీసుకోవడంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్య దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉదయం సమయంలో గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. రోజులో కనీసం నాలుగు లీటర్ల నీటిని తీసుకుంటే కూడా ఈ సమస్య దూరమవుతుంది. ప్రతిరోజూ శారీరక వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

సమస్య మరీ తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్యను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత కొంత సమయం నడవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మెంతి గింజలను రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం తింటే మంచిది.