రివ్యూ : లైగర్

Liger Telugu Movie Review

నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ తదితరులుదర్శకుడు: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి, ఛార్మి, కరణ్ జోహార్
సినిమాటోగ్రపీ: విష్ణు శర్మ
స్క్రీన్ ప్లే : పూరి జగన్నాథ్
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో పూరి- విజయ్ దేవరకొండ కలయికలో నేడు రిలీజ్ అయిన చిత్రం ‘లైగర్’. మరి ఈ సినిమా ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం రండి.

కథ :

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఇంటర్ నేషనల్ ఛాంపియన్ అవ్వాలని లైగర్ (విజయ్ దేవరకొండ) గోల్ పెట్టుకుంటాడు. ఈ గోల కోసం తన తల్లి బాలమణితో (రమ్యకృష్ణ) కలిసి లైగర్ ముంబై చేరుకుంటాడు. అసలు ఛాంపియన్ అవ్వాలనే కల లైగర్ కి ఎందుకు వచ్చింది ?, మరీ తన లక్ష్యం కోసం లైగర్ ఏం చేశాడు ?, ఈ జర్నీలో అతని తల్లి బాలమణి అతనికి ఎలా ప్రేరణగా నిలిచింది ? ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటీ ?, ఇంతకీ లైగర్, తాన్య (అనన్య పాండే)తో ఎలా ప్రేమలో పడ్డాడు ?, చివరకు లైగర్ తాను అనుకున్న గోల్ కి రీచ్ అయ్యాడా? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

విశ్లేషణ :

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తన పాత్ర‌లో తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే, విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కి, అతని నత్తి పాత్ర సెట్ కాలేదు. అయినా, డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్ లో ఎలివేషన్ లేని మాడ్యులేషన్ వర్కౌట్ కాదు అని పూరి తెలుసుకోకపోవడం ఆశ్చర్యకరం. కానీ, తన పాత్రకు విజయ్ నటన పరంగా పర్ఫెక్ట్ న్యాయం చేసినా.. ఇమేజ్ పరంగా తేలిపోయాడు.

ఇక హీరోయిన్ పాత్రలో ఓకే ఎమోషన్ తో సాగే అనన్య పాండే నటన జస్ట్ పరవాలేదనిపిస్తుంది. అలాగే హీరోతో సాగే ఆమె భావోద్వేగ సీన్స్ కూడా బాగాలేదు. ఇక విలన్ పాత్రలో నటించిన మైక్ టేసన్ ఆ పాత్రకు తగ్గట్లు ఆయన కటౌట్ బాగా సెట్ అయ్యింది. ఏది ఏమైనా ఈ సినిమాలో ఉన్న ఏకైక ప్లస్ పాయింట్.. విజయ్ దేవరకొండే. విజయ్ తన లుక్స్ ను తన ఫిజిక్ ను చాలా బాగా మార్చుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

అయితే, ఈ లైగర్ సినిమాలో మెయిన్ ప్లాట్ వైవిధ్యమైనా.. ఇంట్రస్ట్ గా సాగదు. దర్శకుడు పూరి జగన్నాథ్ మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. ఈ చిత్రం చూస్తున్నంత సేపు రెగ్యులర్ యాక్షన్ డ్రామాలు గుర్తుకు వస్తాయి. అన్నిటికీ మించి లైగర్ లో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాలేదు.

 

ప్లస్ పాయింట్స్ :

విజయ్ దేవరకొండ నటన,

నేపథ్య సంగీతం,

కొన్ని యాక్షన్ సీన్స్,

మైనస్ పాయింట్స్ :

సింపుల్ గా సాగే స్టోరీ,

రొటీన్ యాక్షన్ డ్రామా,

సెకండాఫ్ బాగా స్లోగా సాగడం,

సినిమాటిక్ టోన్ మరీ ఎక్కువ అవ్వడం,

లాజిక్ లెస్ డ్రామా.

తీర్పు :

మొత్తంగా సింగిల్ పాయింట్ లో చెప్పుకుంటే.. లైగర్
సినిమాలో మ్యాటర్ కంటే, బిల్డప్ ఎక్కువ అయ్యింది. పైగా రొటీన్ యాక్షన్ డ్రామా వ్యవహారాలతో సాగుతూ.. ఈ సినిమా బాగా బోర్ కొడుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా ప్లాప్ లిస్ట్ లో చేరింది.

రేటింగ్ : 2.25/ 5

బోటమ్ లైన్ : సిల్లీ బోరింగ్ యాక్షన్ డ్రామా !