విజయ్ దేవరకొండ మ్యాజిక్ పని చేసిందా.?

‘ఖుషి’ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినా రివ్యూల్ని మేనేజ్ చేయగలిగాడు విజయ్ దేవరకొండ. ‘ఖుషి’ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.

కథలో కాస్త సాగతీత వున్నప్పటికీ.. నెమ్మదిగా ధియేటర్లకు వెళుతున్నారు ప్రేక్షకులు. మరోవైపు కొన్ని ధియేటర్లు వెలవెలబోతుండడం కూడా చూస్తున్నాం.

అలాగే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ కూడా ప్రేక్షకుల్ని ధియేటర్లకు రప్పిస్తోంది.

పెద్దగా వల్గారిటీ లేకపోవడం కూడా సినిమాకి కలిసొచ్చే అంశమే. ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే చూస్తున్నారు.

అయితే, ఓ చిన్నపాటి వల్గర్ సీన్ సినిమాని కాస్త డ్యామేజ్ చేస్తోందని చెప్పొచ్చేమో. ఇవన్నీ పక్కన పెడితే, పీఆర్ టీమ్స్‌తో స్వయంగా డీల్ చేస్తున్నాడట విజయ్ దేవరకొండ.

అందుకోసం బాగానే ఖర్చు చేస్తున్నాడనీ తెలుస్తోంది. తనకున్న పీఆర్ స్కిల్స్‌తో సినిమాని నిలబెట్టుకోగలడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అని ఈ సినిమాతో ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడనుకోవచ్చేమో.

అయితే అసలు సిసలు అగ్నిపరీక్ష సోమవారం. ఆ రోజు నిలబడగలిగితే, ‘ఖుషి’ హిట్ సినిమా లిస్టులోకి వెళ్లడం ఖాయమే. మొత్తానికి ‘లైగర్’తో వచ్చిన డ్యామేజ్‌ని ‘ఖుషి’తో కాస్తయినా తగ్గించుకున్నాడు విజయ్ అనడం అతిశయోక్తి కాదేమో. రౌడీ ప్యాన్స్‌కి ఇది ఒకింత ఊరటే అనాలి.