ఈ పాప రేటు చాలా ‘హాటు’

‘బేబమ్మ’గా తొలి సినిమా ‘ఉప్పెన’తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు పైగానే ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్ బాబు హీరోగా ‘ఆ అమ్మాయి పేరు చెప్పాలి’, రామ్ – లింగుస్వామి కాంబినేషన్ మూవీ ఒకటి కాగా, తాజాగా నితిన్‌తో ‘మాచర్ల నియోజక వర్గం’ మూవీ ఒకటి.. అన్నీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే. ఇవే కాదు, మరిన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయట. ఈ నేపథ్యంలో అమ్మడి రెమ్యునరేషన్ విషయమై హాట్ హట్‌గా చర్చ నడుస్తోంది.

ఇప్పటికే కృతిశెట్టి రెమ్యునరేషన్ కోటి దాటిందని అంటున్నారు. అంతకన్నా ఎక్కువయినా సరే, ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారట. ప్రస్తుతం కృతిశెట్టి నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రేపో మాపో రిలీజ్‌కీ దగ్గరవుతోంది. ఒకవేళ ఈ సినిమా హిట్టయ్యిందంటే, అమ్మడి రేంజ్ నెక్స్‌ట్ లెవల్ అందుకోవడం పక్కా. ఇక అప్పుడు ఆమె రెమ్యునరేషన్‌ని నిర్మాతలు ఏ రేంజ్‌కి పెంచేస్తారో కూడా ఊహించడం కష్టమే అని ఫిలిం నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, కృతిశెట్టిపై కొంత నెగిటివిటీ కూడా ప్రచారంలో ఉంది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా దర్శకుడితో కృతిశెట్టికి విబేధాలొచ్చాయనే ప్రచారం జరుగుతోంది. అయితే, అలాంటిదేమీ లేదని కృతిశెట్టి కొట్టిపడేసింది.