తెలంగాణ రాష్ర్టంలో కేసీఆర్ సర్కార్ కరోనా పై చెతులెత్తేసిన సంగతి తెలిసిందే. కరోనా పరీక్షల విషయంలో అడ్డంగా బుక్కైన సర్కార్ అటుపై హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకుంది. బయటకు చెప్పింది ఒకటి …లోపల చేసేది మరోకటి. ఇక ఇటీవల ప్రభుత్వం ద్వారా వైద్యం మా వల్ల కాదంటూ నిలువునా నిలబడి చెతులేత్తెసింది. ప్రయివేటు ఆసుపత్రులు కొన్నింటికి కోవిడ్ 19 వైద్యం చేసుకోవచ్చని జీవో జారీ చేసింది. ఒక్కో ఆసుపత్రిలో 30-40 పడక గదులు సిద్దం చేసుకోమని తెలిపింది. దీంతో సిటీలో కార్పోరేట్ ఆసుపత్రుల దందా మొదలైపోయింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే వైద్యం చేయడం ప్రారంభించింది.
ఆరోగ్య బీమా ద్వారా 70 శాతం క్లైమ్ చేసుకునే వెసులు బాటు ఉన్నా, పీపీఈ కిట్లు, ఇతర సామాగ్రి, మందులకు రోగి జేబు నుంచి డబ్బులు తీయాల్సిందే. ఒక వేళ బీమా గనుకు లేకపోతే వైద్యానికి అయ్యే ఖర్చు అక్షరాల 1.20 లక్షలు నుంచి ఇంకా ఎక్కువగానే అవుతుందని తేలింది. ఆసుపత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకుంటే 2200రూలు. అదే ఆసుపత్రి వారు ఇంటికొచ్చి చేయాలంటే 2800 ఖర్చు అవుతుంది. ఇంకా కొన్ని ఆసుపత్రుల వారు ఇంటికొచ్చి చేయాలంటే రూ 5000 కూడా తీసుకుంటున్నారు. ఇంకొన్ని పరీక్షలు తమ వల్ల కాదంటూ కొన్ని ల్యాబులు చేతులెత్తేస్తున్నాయి. బిల్లుల మోత ఎలాగుందంటే..
కరోనా పాజిటివ్ అని తేలితే పీపీఈ కిట్లకు డబ్బులు చెల్లించాలి. డాక్టర్లు, నర్సులు, ఇంకా పేషెంట్ కు దగ్గరగా ఉన్నవారందరికీ పీపీఈ కిట్లు రోగి డబ్బులిస్తే యాజమాన్యం ఏర్పాటు చేస్తుంది. 20-25 కిట్లు ఒక ప్యాక్ కు ఉంటాయి. అందుకు గాను స్పాట్ లో 30వేలు కట్టాలి. 10-15 రోజులు రోగి ఆసుపత్రిలో ఉంటే ఇలాంటి ప్యాక్ లు 2,3 అవసరం అవుతాయి. అంటే ఎలా లేదన్నా రెండు ప్యాక్ లకే 60 వేలు ఖర్చు చేయాలి. ఐసోలేషన్ సాధారణ వార్డులో 4 వేలు, ఐసీయూలో ఉంచితే 7500వేలు, వెంటిలేటర్ అయితే 9000 రూలు చదివించాల్సిందే. ఇది ప్రభుత్వ లెక్క. కానీ ప్రయివేట్ దోపిడి ఎలా ఉందన్నది ఆసుపత్రికి వెళ్లిన తర్వాత అర్ధమవుతుంది.
పైగా ఇది మహమ్మారి కాబట్టి ప్రయివేటు ఆసుపత్రిలో అడుగడుగునా ప్రతీ ఒక్కరి చేయి తడపాల్సిందే. కొవిడ్ ని కేంద్రం జాతీయ విపత్తు గా ప్రకటించింది. జబ్బుకు సంబంధించిన వైద్యం ప్రభుత్వమే చేయించాలి. కానీ దేశం ఆర్ధికంగా నష్టాల్లో కి పోతుందని కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా రాష్ర్టాలకు బడ్జెట్ కేటాయించి తప్పించుకుంది. ఇక గొప్పలు చెప్పుకునే కేసీఆర్ సర్కార్ సామాన్యుడి నెత్తిన బాదుడు మొదలు పెట్టింది. దీంతో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కొన్ని రాష్ర్టాలు ఇంకా ప్రభుత్వం వైద్యం అందిస్తుంటే కేసీఆర్ మాత్రం అందరికంటే ముందుగానే సామాన్యుడి నెత్తిన కరోనా బాదుడు వేసారని మండిపడుతున్నారు. ఇదేనా కేసీఆర్ కన్న బంగారు తెలంగాణ అంటూ తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.