ఒక్కసారిగా పాతాళానికి పడిపోయిన కేసీయార్ గ్రాఫ్.!

KCR

అనూహ్యం.! ఏ విషయమ్మీద అయినా గుక్క తిప్పుకోకుండా మాట్లాడేసే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. అసందర్భ వ్యాఖ్యలు చేసేసి, బొక్కబోర్లాపడ్డారు రాజకీయంగా.!

తెలంగాణలో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో, క్లౌడ్ బరస్ట్ జరిగిందనీ.. దీని వెనుక విదేశాల కుట్ర దాగి వుండొచ్చనీ కేసీయార్ అనుమానం వ్యక్తం చేసిన విషయం విదితమే. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. బీజేపీ నేతలైతే, కేసీయార్ మానసిక స్థితి బాగున్నట్టు లేదంటూ జాలి ప్రదర్శించారు.

ఎలా.? కేసీయార్ ఇంత తేలిగ్గా విదేశీ కుట్ర అని ఎందుకు అనేశారు.? అంటూ గులాబీ శ్రేణులే ముక్కున వేలేసుకుంటున్నాయి. అధినేత వ్యాఖ్యల్ని సమర్థించలేక, వాటిని ఖండించలేక.. గులాబీ నేతలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

వెదర్ వార్.. అంటూ సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. గులాబీ బాస్ చెప్పింది నిజమేననడానికి ఇవీ రుజువులంటూ ఏవేవో కట్టు కథలు కొందరు ప్రచారం చేస్తున్నారు. అయినాగానీ, డ్యామేజ్ మాత్రం కంట్రోల్ అవడంలేదు.

నిజానికి, కేసీయార్ క్లౌడ్ బరస్ట్ విషయమై ‘విదేశాల కుట్ర’ అనే వ్యాఖ్యలు చేసి వుండకూడదు. ఎందుకంటే, ఆయన బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిలో వున్నారు. పైగా, తెలంగాణ సమాజానికి కేసీయార్ బ్రాండ్ అంబాసిడర్ అన్న భావన అందరిలోనూ వుంది. దాన్ని ఆయన చెడగొట్టుకుంటే ఎలా.? తన గ్రాఫ్ తానే పడేసుకుంటే ఎలా.?