కేసిఆర్ లోని యాంగ్రీ లీడర్ ని టచ్ చేసిన జగన్ మోహన్ రెడ్డి ..రిజల్ట్ ఇలా ఉండబోతోంది !

KCR wants to create history with new secretariat

2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహంపై అప్పట్లో జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. కేసీఆర్ ఈజ్ మ్యగ్నానమస్, పెద్ద మనసున్న వ్యక్తని అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు ఈ స్నేహం కాస్త గోడవగా మారనుంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే తెలంగాణాలో, నీటి పారుదలశాఖపై కేసిఆర్ సమీక్ష చేస్తూ, ఏపీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. నీటి ప్రాజెక్టుల విషయంలో, అటు కేంద్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీరు సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పై, ఆంధ్రప్రదేశ్ అర్ధం లేని నిరాధార ఆరోపణలు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని అన్నారు వీటి అన్నిటి పై, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమర్థంగా వాదనలు వినిపిస్తామని అన్నారు. నేను ఏపి ప్రభుత్వ పెద్దలను పిలిచి, భోజనం పెట్టి, ఇరు రాష్ట్రాల రైతులకు ఉపయోగపడేలా ప్రణాళిక రచించి, బేసిన్లు, భేషజాలు లేవని చెప్తే, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుందని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు కూడా జగన్ కు ప్రశ్నలు సందిస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్ ను పొగిడిన జగన్, ఇప్పుడు ఏపీపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ తన స్నేహం కోసం రాష్ట్రాన్ని కూడా వదిలేయగలడని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు స్నేహితులుగా ఉన్న నాయకులు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారనున్నారని, కేసీఆర్ ను ఎక్కడ టచ్ చేయకూడదో జగన్ అక్కడే టచ్ చేశాడని, కేసీఆర్ దాటిని జగన్ తట్టుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.