వైకాపా ప్రభుత్వాన్ని పచ్చ మీడియా టార్గెట్ చేసి విమర్శిస్తున్న మాట వాస్తవం కాదంటారా. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా దాని వెనుక విషయం చిమ్మడం పచ్చ మీడియా ఓ పనిగా పెట్టుకుని…అందులోనూ కంకణం కట్టుకుని ఓ బ్యాచ్ పనిచేస్తుంది అన్నది నిజం కాదంటారా? ప‌్రజలకి దక్కే ఫలాల విషయంలో ఎప్పటికప్పుడు విష పూరిత కథనాలతో వేడెక్కించడం ఆ వర్గం మీడియాకే చెల్లిందన్నది తెలియదంటారా. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు నుంచి పచ్చ మీడియా అదే పనిమీద ఉంది. ఇక అధికారం చేజిక్కించుకున్న తర్వాత మరింత కక్షపూరితంగా..ఏక పక్షంగా వ్యవరిస్తోంది.
అందులోనూ ఏబీఎన్ న్యూస్ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికలైతే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ముందున్నాయని ఆ పార్టీ వర్గీయులు ఎప్పటికప్పుడు మండిపడుతూనే ఉన్నారు. ఇక ఏడాది కాలంగా జగన్ మోహన్ రెడ్డి ఆ రెండు మీడియా సంస్థల్ని ఆర్ధికంగా దెబ్బకొడుతున్నారని చిలవలు ఫలవులుగా కథనాలొస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఆయన అనుకూల మీడియా ప్రభుత్వ ప్రకటనల ద్వారా బాగానే వెనకేసాయి. అయితే ఏడాది గా అధికారంలో ఉన్నది జగన్ మోహన్ రెడ్డి కావడంతో ఏబీయన్ ఆర్కేని ప్రకటనల పరంగా దెబ్బకొడుతున్నారని తొలి నుంచి వినిపిస్తున్నదే.
ఈ నేపథ్యంలో ఏడాదిగా జగన్ ప్రచారానికి, ప్రభుత్వ ప్రకటనలకు ఖర్చు చేసిన మొత్తం జాబితాను ఆర్టీఐ ద్వారా సేకరించింది ఓ వ్యక్తి నేరుగా ఆంధ్రజ్యోతికిచ్చారు. దీంతో సదరు పత్రిక తనదైన శైలిలో అచ్చేసింది. ఏడాది కాలంలో 100 కోట్ల రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేసారని, అందులో 52 కోట్ల రూపాయలు జగన్ సొంత మీడియాకే మళ్లించారని, 39 శాతం ఈనాడుకి ఇచ్చారని, తమకు మాత్రం పావలానే ఇచ్చారని ఇదీ పత్రికలపై జగన్ తీరు అన్నట్లు అచ్చేసారు. మరి ఈనాడు కూడా జగన్ పై వ్యతిరేక కథనాలు వేసింది. కానీ పనిగట్టుకుని అదే పనిమీద లేదు. సందర్భం..సమయానుసారం వ్యవహరించింది. కానీ ఆ పత్రిక తీరే వేరు కదా. అందుకే ఇప్పుడు ఫలితం అనుభవిస్తుందేమో.