బీసీ వర్గం అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాటు పడుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కొత్తగా బీసీల్లో ఆయా కులాల వారీగా 54 కార్పోరేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ కార్పోరేషన్లకు చైర్మన్లు, సభ్యుల ఎంపిక కసరత్తులు ప్రారంభం అయ్యాయా? అంటే అవుననే తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. దీనిలో భాగంగా తొలి విడతలో 200 వరకూ పదవులు భర్తీ చేపట్టనున్నారుట. ఇవన్నీ కూడా బీసీల్లోని ఉపకులాల వారికే. వీలైనంత త్వరగా ఈ భర్త ప్రక్రియ ముగించాలని జగన్ భావిస్తున్నారుట. ఇప్పటికే జగన్ వద్ద ప్రణాళిక పక్కాగా ఉందని, చైర్మెన్ల బాధ్యతలు ఎవరికి అప్పగించాలి? సభ్యులుగా ఎవర్నీ నియమించాలని జగన్ మోహన్ రెడ్డి డిసైడ్ అయిపోయారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
ఒక్కో కార్పోరేషన్ కు ఒక చైర్మన్ తో పాటు, ఏడు నుంచి తొమ్మిది మంది సభ్యుల్ని కూడా కార్పోరేషన్లో నియమించాలని ప్లాన్ చేస్తున్నారుట. ఇలా మొత్తం 54 కార్పోరేషన్లకు అన్ని లెక్కలు కట్టగా 200 మంది వరకూ నామినెటెడ్ పదవుల్లో కూర్చోనున్నారని తెలుస్తోంది. ఇక ఈ పదవులన్నీ కూడా క్లీన్ సర్టిఫికెట్ ఉన్న వారికే ఇవ్వాలని భావిస్తున్నారుట. ఇందులో ఎలాంటి రికమండీషన్లకు తావు లేకుండా..పక్కాగా బీసీల్లో ఓ జాబితా సిద్దం చేసి నిజాయితీగా పార్టీ కోసం శ్రమించిన వారిని మాత్రమే ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా వచ్చే రికమండీషన్లను అస్సలు పట్టించుకోవద్దని అధికారులని ఆదేశించారుట.
అలాంటి వ్యవహారాలు ఏమైనా తమ దగ్గరకు వస్తే నేరుగా తననే సంప్రదించి విషయం వివరించాలని..అందులో ఏమాత్రం జాప్యం జరిగినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని జగన్ హెచ్చరించారుట. రికమండీషన్ దరఖాస్తులైమైనా వస్తే వెంటనే వాటిని చెత్తబుట్టలో వేసేయాల్సిందిగా గట్టిగానే చెప్పినట్లు సమాచారం. మొత్తానికి బీసీ వర్గంలో ఆశావహులకు ఇది మంచి వరమనే చెప్పాలి. కీలక నేతల్ని చైర్మన్లగా నేరుగా జగన్ నియమించే అవకాశం ఉంటుంది. అలాగే జగన్ విథయేలుగా ఉన్న వారికే సభ్యత్వం తప్పనిసరే అనిపిస్తోంది. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి బీసీలకు చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద పీట వేసారు కదా.