Balakrishna: బాలయ్య అబద్ధం ఆడతారని అనుకోను : మంత్రి నాని

Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవను అని చెప్పినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆ ప్రచారంలో నిజం ఉందని తాను అనుకోవడం లేదు అంటూ మంత్రి నాని అన్నారు. తాజాగా మీడియా సమావేశంలో మంత్రి నాని మాట్లాడుతూ.. అఖండ సినిమా విడుదలకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను మీడియాకు వెల్లడించారు.

హైదరాబాదులో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్ ద్వారా, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా అఖండ నిర్మాతలు తనను కలవడానికి సినిమా విడుదలకు ముందు కలవడానికి విజయవాడ వచ్చారని , ఆ సమయంలోనే బాలయ్య బాబు తో ఫోన్ లో కూడా మాట్లాడించారు అని తెలిపారు నాని. ఆ సమయంలో జగన్ ను కలుస్తానని బాలకృష్ణ చెప్పారని, అదే విషయాన్ని సీఎం జగన్ కు తాను తెలిపారు అని చెప్పుకొచ్చారు నాని. అప్పుడు అఖండ సినిమాకు సంబంధించి నిర్మాతలకు పూర్తి సహకారం అందించమని జగన్ తనతో చెప్పారని, బాలకృష్ణ తనను కలిస్తే అది వేరే నిజమైన ప్రచారానికి కారణం అవుతుందన్నారని నాని తెలిపారు.