ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైఎస్ షర్మిల. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటున్న షర్మిల ఇప్పుడు సడన్ గా కొత్త పార్టీ అనే నినాదం ఎత్తుకున్నారు. ఈ ఒక్కమాటతో ఇప్పుడు షర్మిల రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతున్నదే ఇక్కడ ఉన్న వైసీపీ అభిమానులు తనకు మద్దతు తెలుపుతారని కానీ ఇప్పుడు వైసీపీ నేతలు మాత్రం షర్మిలకు తమ మద్దతు ఉండదని స్పష్టంగా చెప్తున్నారు.
షర్మిలకు వైసీపీ మద్దతు ఉండదా!!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు తెలంగాణలో ఇంకా ఉన్నారు. వాళ్లందరికీ ఇక్కడ నాయకుడు లేకపోవడం వల్ల వాళ్ళందరు వేరే పార్టీలలో ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ అండ చూసుకొని షర్మిల ఇక్కడ పార్టీ పెడుతున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ షర్మిలకు షాక్ ఇచ్చారు. ఆమె ఇక్కడ పార్టీ పెట్టినా కూడా జగన్ చెప్తేనే తప్ప తమ మద్దతు ఆమెకు ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆమె ఇక్కడ వైసీపీని నడిపించి ఉంటే ఆమెకు మద్దతు ఇచ్చేవాళ్ళమని కానీ ఆమె ఇప్పుడు ఇక్కడ కొత్త పార్టీ పెడితే తమ మద్దతు ఉండదని చెప్తున్నారు.
ఇదంతా జగన్ ప్లాన్
షర్మిలకు తెలంగాణలో మద్దతు రాకుండా ఉండటం అనే అంశం జగన్ యొక్క ప్లాన్ అని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. మొదట నుండి వైసీపీకి తెలంగాణలో అభిమానులు ఉన్నారు. కానీ జగన్ మాత్రం కేవలం ఏపీని మాత్రమే ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ సీఎంగా ఉన్న కేసీఆర్ కు అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే. జగన్ కు, కేసీఆర్ కు మధ్యన ఉన్న స్నేహం గురించి అందరికి తెలిసిందే. ఈ స్నేహం వల్లే జగన్ తెలంగంలోకి రాలేదదని, ఇప్పుడు షర్మిల రావడం కూడా జగన్ కు ఇష్టం లేదని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.