అమరావతి:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మల్టీ టాస్కింగ్ చేయడంలో దిట్టని తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమరావతి సమస్య పెద్ద సమస్య నడుస్తుంది. అలాగే కరోనా కూడా రాష్ట్ర ప్రజలను పట్టి పిడిస్తుంది. ఇవన్నీ సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటూనే, నూతన పథకాలను ఏర్పాటు చేస్తూ పరిపాలనలో తన మార్క్ ను చూపిస్తున్నారు. తాజాగా రైతులు పండించిన పంటల యొక్క మార్కెటింగ్ కు సంబంధించిన ఒక కొత్త పథకం ప్రారంభించారు. పరిశ్రమలు వాణిజ్య శాఖ వ్యవసాయం సహకార శాఖల సమన్వయంతో జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తులు గిట్టుబాటు ధర మార్కెటింగ్ ఇతర అంశాలపై రైతులకు టాస్క్ ఫోర్స్ కమిటీ సేవలు అందించనుంది. వ్యవసాయ పరిశ్రమల శాఖతో సహా 11 శాఖల ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆహారశుద్ధి విలువ జోడింపు వంటి అంశాలపై ఈ కమిటీ రైతులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది.
రైతులు పండించే పంటలను ఉపయోగించుకునే తమ మార్కెటింగ్ స్కిల్స్ వల్ల రైతుల కంటే ఎక్కకువ సంపాదిస్తున్నారు. రైతులకు ఉన్న మార్కెటింగ్ లోపాలను గుర్తించిన ప్రభుత్వం ఈ నూతన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఈ తాజా నిర్ణయంలోనే రైతులకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు ముఖ్యమంత్రుల మధ్య నూతన పాలన విషయంలో పోలుస్తూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టనున్న ఈ నూతన పథకం వల్ల కూడా ప్రజలు పోల్చానున్నారు. డేరింగ్ నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పోలిక నుండి తప్పించుకోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నారో వేచి చూడాలి. వైసీపీ ప్రభుత్వం రైతులకు ఖరీఫ్ సీజన్లో విత్తనాల ఇబ్బందులు లేకుండా సరఫరా చేసింది. నీటి సౌకర్యం లేని వ్యవసాయ భూముల్లో సొంత ఖర్చుతో బోర్లు వేయించాలని కూడా నిర్ణయించుకుంది.