వర్షాకాలంలో రోగాలు తరిమికొట్టే సూపర్ ఫుడ్ ఇదే?

వర్షాకాలం అనగానే అనేక రకాల వ్యాధులు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జలుబు దగ్గు జ్వరం తలనొప్పి వంటి అనేక రకాల సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అందువల్ల వర్షాకాలంలో రోగాల బారిన పడుకున్న ఉండటానికి మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు వహించాలి. వర్షాకాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే మంచి పోషకాలు ఉన్న పౌష్టికాహారం తీసుకోవటం చాలా అవసరం. అనేక రకాల పండ్లు కూరగాయలలో మన శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా సెనగలలో మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి.

సాధారణంగా చాలామంది సెనగలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని వాటిని తినటానికి ఆసక్తి చూపరు. కానీ సెనగలు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభించి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వర్షాకాలంలో వచ్చే రోగాల భారీ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి ఎంతో ఉపయోగపడుతుంది. సెనగలలో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా సెనగల్లో విటమిన్ ఎ, సి, బి6, ఫోలేట్‌, రిబోఫ్లేవిన్, ‌నియాసిన్‌, వంటి విటమిన్లతో పాటు మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, ఐరన్‌, కాపర్‌ వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి.

శనగలలో ఉండే పీచు పదార్థం మన శరీరంలో తిన్న ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తూ ఆకలి మందగించేలా చేస్తుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఉన్న క్యాలరీలు కరిగి అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. ప్రతిరోజు గుప్పెడు శనగలు తినడం వల్ల ఇందులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం శరీరంలోని కండరాలు ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా శనగలలో ఉండే కోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మెరుగుపడేలా చేస్తుంది. ఇక సెనగలలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. సెనగలు తినటం వల్ల ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఈ వర్షాకాలంలో ఉడికించిన లేదా వేయించిన శనగలను తినటం చాలా అవసరం.