వేసవికాలంలో చాలామంది కొత్తిమీర నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. కొత్తిమీరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి. కడుపు సంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగించడంలో ఇవి తోడ్పడతాయి.
కొత్తిమీర నీరు కడుపు నొప్పి, ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, వాయువు వంటి సమస్యలకు ఉపశమనం ఇవ్వడంలో ఎంతగానో సహాయపడుతుంది. కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గిస్తాయి. కొత్తిమీర నీరు జీవక్రియను పెంచి, ఊబకాయం వల్ల కలిగే వాపును సులువుగా తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి. కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ ఏజెంట్లు చర్మాన్ని ఉపశమనం కలిగిస్తాయి.
కొత్తిమీర గింజల్లో జీర్ణ ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియను సులభతరం చేయడంలో సహాయపడతాయి. కొత్తిమీర నీరు మలబద్ధకం సమస్యను దూరం చేస్తుందని చెప్పవచ్చు. కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయని చెప్పవచ్చు. కొత్తిమీర నీళ్లు చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెడతాయి.
కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో కొత్తిమీర నీళ్లు తోడ్పడతాయి. బరువు తగ్గాలని భావించే వాళ్లు వెంటనే కొత్తిమీర నీళ్లను అలవాటు చేసుకుంటే మంచిది