జగన్ సర్కార్ కి వ్యతిరేక ఓటు రాకపోవడానికి అదే కారణమా ?

CM pics taking wrong step again

ఏపీ మునిసిప‌ల్‌,కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎవ‌రికి ఎన్ని ఓట్లు ప‌డ్డాయి. ఏ పార్టీ ఓట్ షేర్ ఎలా ఉంది , అనే గ‌ణాంకాలు కూడా వ‌చ్చేశాయి. దీనిని బ‌ట్టి ఈ ఎన్నిక‌ల్లో న‌గ‌ర ఓట‌రు కేవలం 62 శాతం మంది మాత్రమే.. ఓట్లేశారు. వాస్తవానికి ఇటీవ‌ల జరిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పార్టీ గుర్తుపై పోటీ లేక పోయినా, 80 శాతం మంది ఓట‌ర్లు పోటెత్తి మ‌రీ ఓట్లేశారు. దీంతో టీడీపీ చాలా పంచాయతీను రాబ‌ట్టుకుంది. కానీ స్థానిక ఎన్నిక‌ల‌కు వ‌చ్చేసరికి మాత్రం సీన్ రివ‌ర్స్ అయిపోయింది. ఇక్కడ కూడా 75 శాతం నుంచి 80 శాతం మ‌ధ్య ఓటింగ్ జ‌రుగుతుంద‌ని అంద‌రూ అంచ‌నా వేసుకున్నా చివ‌రి నిముషంలో ఓట‌ర్లు నిర్లిప్తత‌గా వ్యవ‌హ‌రించారు.

CM pics taking wrong step again
CM 

దీంతో పంచాయ‌తీ ఓట్ల శాతాన్ని స్థానికం అధిగ‌మించ‌లేక పోయింది. అంతేకాదు, గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో 82 శాతంగా ఉన్న ఓటింగ్ కూడా ఇప్పుడు న‌మోదు కాలేదు. దీంతో ఈ విష‌యం ఆస‌క్తిగా మారింది. ఒక వేళ‌ 80 శాతం ఓటింగ్ జ‌రిగి ఉంటే, ఫ‌లితం ఎలా ఉండేదని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌రిగిన ఓటింగ్‌లో వైసీపీకి 52 శాతం పైగానే ఓట్లు పోల‌య్యాయి. ఇక‌, టీడీపీకి 30 శాతం ఓటింగ్ జ‌రిగింది. ఇది గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే, వైసీపీకి పెరిగి టీడీపీకి త‌గ్గిన‌ట్టుగా భావించాలి. అలా కాకుండా గత సార్వత్రిక ఎన్నిక‌ల మాదిరిగానే.. ఇప్పుడు కూడా ఓటింగ్ 80 శాతం దాటితే, అంటే మ‌రో 18 నుంచి 20 శాతం ఓట్లు క‌నుక ప‌డితే ప్రతిప‌క్షం పుంజుకునేద‌ని అంటున్నారు.

అయితే, ఈ 18-20 శాతం ఓట్లు ఎవ‌రివి ? వారు ఎందుకు పోలింగ్‌పై ఆస‌క్తి చూపించ‌లేదు. అనేవిష‌యాలు ఆస‌క్తిగా మారాయి. సాధార‌ణంగా ఈ ఎన్నిక‌లు.. ప్రభుత్వాన్ని మార్చేవి కావు. అదే స‌మ‌యంలో బ‌ల‌మైన మార్పుల‌కు నాంది జ‌రిగే అవ‌కాశ‌మూ లేదు. లోక‌ల్ బాడీ అంటే, లోక‌ల్ బాడీ మాత్రమే. సో.. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా త‌మ నాడిని స్పష్టం చేయాల‌ని అనుకున్న వారు కూడా ఎందుకులే అనుకునే ప‌రిస్థితి ఉంటుంది. ఇంత క‌ష్టప‌డి వెళ్లి స‌ర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తే ఇప్పుడు మ‌న‌కు వ‌చ్చేదేంటి వ‌చ్చే ఎన్నిక‌ల్లో చూసుకుందాం లే.. అని సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గం ఎక్కువ‌గా భావించి ఉంటుంద‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ 18 శాతం ఓట్లు కూడా పోలై ఉంటే టీడీపీకి కొంత మేర‌కు ఎడ్జ్ ఉండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.