అధికారంలో ఉన్న వైకాపా పార్టీలో అసమ్మతి సెగ రేగిన మాట వాస్తవం. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే జగన్ పని తీరుపై గుసాయిస్తున్నారు.. ఏడాది లో ఆయన్ని కలిసి సమస్యలు చెప్పుకున్నది లేదని..తమ నియోజక వర్గాలను ఇంకెలా అభివృద్ది చేసుకుంటామని లబోదిబో మన్న మాట వాస్తవం. అలాగని జగన్ ని పూర్తి గా తప్పుబట్టలేదు. కలిసి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అయితే కొంత మంది మాత్రం జగన్ పై పూర్తి వ్యతిరేకతనే వ్యక్తం చేసారు. నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు జగన్ మారాలి. అది జరిగితేనే పార్టీలో ఉంటాను లేదంటే వెళ్లిపోతానని హెచ్చరించడం జరిగింది.
తాజాగా వైకాపా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు వైఖరీ చూస్తుంటే వైకాపాపై వ్యతిరేక స్వరం పెచినట్లే కనిపిస్తోంది. తనకు జగన్ అంటే ఇష్టం అంటూనే..ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించడం చేస్తున్నారు. ఈ విషయంలో కనుమూరి మొదటి నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జగన్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయినా కనుమూరి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన వ్యాఖ్యలను బట్టే తెలుస్తోంది. తాజాగా ఆయన పరిస్థితి పీక మీద కత్తిలా మారినట్లు తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది. ఇటీవలే ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వైకాపా నాయకులు ఎవరూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ప్రకటన ఇచ్చారు.
అలా వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో వైకాపా గూటి పక్షులన్ని ఏబీయన్ కు దూరంగా ఉంటున్నాయి. కానీ కనుమూరి చెవికి ఆవేమి ఎక్కలేదు. తాజాగా ఏబీఎన్ చర్చా కార్యక్రమలో నిలిచి వివాదాస్పదమ్యారు. దీనికి సంబంధించి నేరుగా చీప్ విప్ గడికోట నుంచే కనుమూరికి ఫోన్ కాల్ వెళ్లిందిట. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోరా? అని చీప్ విప్ ప్రశ్నించగా..అటు నుంచి అంతే ధీటుగా సమాధానం వచ్చిందిట. ఈ విషయం జగన్ దృష్టికి చేరుకుందిట. దీంతో ఎంపీకి షాకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారుట. అయితే అంతకు ముందు కనుమూరి అధిష్టానం తో మాట్లాడే విధానాన్ని బట్టి షోకాజ్ ఇవ్వాలా? లేదా? అన్నది తేలనుంది. జగన్ పై వ్యతిరేక కథనాలు రాసే మీడియా సంస్థ కాబట్టి ఈ విషయంపై సీఎం కఠినంగానే వ్యవరించే అవకాశం కనిపిస్తోంది.