సుకుమార్ రాజమౌళిని మించే సినిమా చేయబోతున్నాడా?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఎలాంటి డౌట్ లేకుండా టాప్ దర్శకుడు ఎవరు అంటే అది ఖచ్చితంగా దర్శకుడు రాజమౌళి అనే చెప్తాము. అయితే రాజమౌళి విజన్ తో భారీ సినిమాలు చేసి టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర ఓ టాప్ డైరెక్టర్ గా మారారు.

అయితే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి కి గట్టి పోటీ ఇచ్చే దర్శకులు లేరా అంటే డెఫినెట్ గా ఉన్నారు. మరి అలాంటి దర్శకుల్లో అయితే క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ కూడా ఒకరు. రాజమౌళి సినిమాల్లో అయితే లాజిక్స్ ఉండవు కానీ సుకుమార్ లాజిక్స్ కంటెంట్ రెండింటితో కూడా కొడతాడు.

మరి ఇప్పుడు రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ లో ఎస్టాబ్లిష్ కాగా సుకుమార్ కూడా “పుష్ప” సినిమాతో ముద్ర వేసాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 తో మరింత హైప్ తెచ్చుకున్న సుకుమార్ ఆ నెక్స్ట్ మాత్రం దర్శకుడు రాజమౌళికి డెఫినెట్ గా చెక్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.

తాజాగా బాలీవుడ్ నిర్మాతలతో సుకుమార్ కలవడం పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ గా మారగా ఇప్పుడు ఈ క్రేజీ పై మరింత ఆసక్తికర సమాచారం తెలుస్తుంది. మరి ఈ కలయికలో సినిమా అయితే ఇండియన్ సినిమా పేస్ ని మార్చే విధంగా ఉంటుందని అంటున్నారు. దీనితో ఈ చిత్రం కోసం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.