ఓ పార్టీ అధినేత్రి ఫిర్యాుదు చేస్తే, ఏకంగా ఓ ముఖ్యమంత్రిని సీబీఐ అరెస్టు చేసేస్తుందా.? అరరె, ఇదేం ప్రశ్న.! ఈమాత్రం ఆలోచన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఎందుకు రాలేదట.! బీజేపీ పెద్దెలవరో సూచించడమేంటి.? హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మీద ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి’ అంటూ సీబీఐకి వైఎస్ షర్మిల ఫిర్యాదు చేసెయ్యడమేంటి.?
నవ్విపోదురుగాక నాకేటి.. అన్నట్లుంది వ్యవహారం.! లేకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనుకున్నప్పుడు.. వైఎస్ షర్మిల అండ్ టీమ్, నేరుగా ఆధారాలు పట్టుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. అప్పుడు కదా, కథ ముందుకు నడిచేది.?
సరిగ్గా మునుగోడు ఉప ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర సమితి తరపున అభ్యర్థి ఖరారవుతుండడం.. ఇంకోపక్క తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చేందుకు కేసీయార్ వ్యూహరచన చేసిన సమయంలో వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్ళి, సీబీఐకి ఫిర్యాదు చేసేశారు.
పైగా, మేఘా సంస్థపైనా ఆ ఫిర్యాదులో ఆరోపణలు చేశారట వైఎస్ షర్మిల.! ఆ మేఘా సంస్థకే కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల కాంట్రాక్టులూ దక్కుతున్నది. ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడటానికి నానా కష్టాలూ పడింది కూడా ఈ వైఎస్ షర్మిలనే కదా.!
మేఘా సంస్థ మీద ఫిర్యాదు చేసినప్పుడు, ఏపీలోని ప్రాజెక్టుల వ్యవహారంపైనా వైఎస్ షర్మిల పేర్కొని వుంటే.. అసలు సంగతి బయటపడిపోయేది. సరే, అంత రిస్క్ ఆమె చెయ్యలేరు.
నిజానికి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై బీజేపీ కూడా అవినీతి ఆరోపణలు చేసింది. కానీ, బీజేపీ తమ కనుసన్నల్లో నడిచే సీబీఐని ఎందుకు రంగంలోకి దించలేదు.?
మరీ వైఎస్ షర్మిల అంత ఈజీగా బీజేపీ ట్రాప్‌లో ఎలా పడిపోయారో ఏమో.! ఇక్కడితో తెలంగాణలో వైఎస్ షర్మిల పొలిటికల్ మైలేజ్ ఖతం అయినట్లే.!