రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ జెండాను ఎగరవేయడానికి బీజేపీ ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తుంది. అయితే తెలంగాణలో ఇప్పటికే బీజేపీ తమ సత్తాను చూపించుకుంటు టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తుంది. అయితే ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. దింతో ఏపీలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి బీజేపీ నాయకులు విపరీతమైన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహాలు వల్ల రానున్న రోజుల్లో ఏపీ కూడా మరో యూపీగా కుల, మత కలహాలకు కేంద్రంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రథయాత్రకు సిద్ధమైన బీజేపీ
రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న ప్రముఖ క్షేత్ర కపిల తీర్థం నుంచి విజయనగరంలోని రామతీర్థం వరకు ఈ రథయాత్రను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించడం సంచలనంగా మారింది. వచ్చే నెలలోనే దీనికి ముహూర్తం పెట్టాలని నిర్ణయించారు. తద్వారా.. హిందూ మతస్తులను బీజేపీకి చేరువ చేసే లక్ష్యంతో నాయ కులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గతంలో బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ ఆద్వానీ నిర్వహించిన రథయాత్ర ఎన్ని విధ్వంసలకు కారణం అయ్యిందో అందరికి తెలుసు. అలాంటి కార్యక్రమంతో బీజేపీ ఇప్పుడు ముందుకు వస్తుంది.
మరో యూపీగా మారనుందా!!
బీజేపీ పాలనలో యూపీ ఎలా మారిందంటే ఇండియాలో ఒక హత్య జరిగిందంటే వేరే దేశాల ప్రజలు మరో ఆలోచన లేకుండా యూపీలోనేనా అని ఆడిగేంతగా. అలాగే ఇక్కడ మతపరమైన రాజకీయాలు ఎక్కువగా నడుస్తుంటాయి. ఇప్పుడు ఏపీ కూడా బీజేపీ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రానున్న రోజుల్లో మరో యూపీగా మారనుందని తెలుస్తుంది. అలాగే ఈ మత రాజకీయాలు చెయ్యడానికి బీజేపీ నాయకులు కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తిరుపతి ఉప ఎన్నికను ఉద్దేశించు బండి సంజయ్ మాట్లాడుతూ…బైబిల్ పార్టీకి ఓటు వేస్తారా లేక హిందు పార్టీకి ఓటు వేస్తారా అని బహిరంగంగా చెప్తున్నారంటే బీజేపీ నాయకుల అంతరార్ధం ఎంతో అర్ధమవుతుంది.