Samantha And Naga Chaitanya : టాలీవుడ్లో మోస్ట్ ఫేవరెట్ లవ్లీ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ జంట అక్కినేని నాగ చైతన్య మరియు సమంతా లు ఇప్పుడు తమ వివాహ బంధం నుంచి విడి పోయి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సమంతా అయితే మరీ వేరే లెవెల్ సినిమాలతో బిజీగా వుంది.
అయితే ఇదిలా ఉండగా వీరు విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఏదొక విషయం లో వీరి పేర్లు పక్క పక్కనే చేరుతున్నాయి. అలానే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు ఒకే చోట షూటింగ్ లో బిజీగా ఉన్నారట. ఈరోజు వీరిద్దరి సినిమాలు “బంగార్రాజు” మరియు “యశోద” సినిమాలు రామానాయుడు స్టూడియో లో షూటింగ్ జరుపుకుంటున్నాయట.
అది కూడా దగ్గర్లోనే అన్నట్టు కూడా తెలుస్తోంది. కానీ వీరు ఈ సమయంలో ఎలాగో దగ్గరే ఉన్నారు కాబట్టి కలిసి మాట్లాడుకున్నారా లేదా అని చర్చలు కూడా స్టార్ట్ అయ్యిపోయాయి. దీనితో ఇప్పుడు ఈ టాక్ విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.