Miss Universe 2021: ఈరోజు ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021లో భారత్ నుండి ప్రాతినిధ్యం వహించిన హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది. ‘లారా దత్తా’ 2000లో టైటిల్‌ను గెలుచుకున్న 21 ఏళ్ల తర్వాత సంధు ఈ ఘనత సాధించింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు సుస్మితాసేన్ (1994) తో కలిపి భారత్ నుండి ముగ్గురు మాత్రమే విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
https://twitter.com/MissUniverse/status/1470227063789563907
పంజాబ్‌కు చెందిన 21ఏళ్ల ఈ ముద్దుగుమ్మ పరాగ్వేకు చెందిన నాడియా ఫెరీరా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా మస్వానేలను అధిగమించి మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. మాజీ మిస్ యూనివర్స్ ‘ఆండ్రియా మెజా’ శ్రీమతి సంధుకు కిరీటాన్ని అందించారు. ఈ పోటీల్లో అందంతో పాటు తన తెలివితో అందర్నీ ఆకట్టుకుంది హర్నాజ్ సంధు.
యువతులు తమ ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నకు సంధు సమాధానమిస్తూ… “ ఈరోజుల్లో యువతులు తమని తాము నమ్మడంలో ఒత్తిడి అనుభవిస్తున్నారని, ఇతరులతో పోల్చుకోవడం మానేసి, మీరే ప్రత్యేకమైన వారని గుర్తించాలన్నారు. మీ కోసం మీరే మాట్లాడాలి, మీ లైఫ్ కి మీరే లీడర్ అని అర్థం చేసుకోవాలి. నాపై నాకు నమ్మకం ఉంది కనుకనే ఈ రోజు ఇక్కడ ఉన్నాను” అని సంధు చెప్పింది.
17 సంవత్సరాల వయస్సులో తన ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన సంధు, గతంలో మిస్ దివా 2021, ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 కిరీటాన్ని గెలుచుకుంది. ఫెమినా మిస్ ఇండియా 2019లో టాప్ 12లో కూడా నిలిచింది. ఆమె “యారా దియాన్ పూ బరన్”, “బాయి జీ కుట్టాంగే” వంటి పంజాబీ చిత్రాలలో కూడా నటించింది.
