Devotional: శని ప్రభావ దోషం తొలగిపోవాలంటే సంక్రాంతి రోజు ఇవి ధానం చేయాలి!

Devotional: తెలుగు క్యాలెండర్ ప్రకారం హిందూ ప్రజలు సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఇలా ఈ పండుగ కోసం పట్టణాలలో ఉన్న ప్రతి ఒక్కరూ పల్లెలకు చేరుకొని పెద్దఎత్తున ఈ పండుగను జరుపుకుంటారు.ఇకపోతే మకర సంక్రాంతి రోజు సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి రోజు పెద్ద ఎత్తున సూర్యభగవానుడికి పూజలు చేస్తారు.

మకర రాశికి అధిపతి శనీశ్వరుడు కనుక శని ప్రభావ దోషం తొలగిపోవాలంటే మకరసంక్రాంతి రోజు సూర్యుడిని పూజించడం వల్ల శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శని ఇంటిలోకి ప్రవేశిస్తాడని అర్థం.ఇలా శని ఇంటిలోకి వెళ్ళిన సూర్యుడికి శని దేవుడు నల్లనువ్వులతో స్వాగతం పలికారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా నల్లనువ్వులతో ఎవరైతే సూర్య దేవుడిని, శనిని పూజిస్తే వారిపై శని ప్రభావం దోషం ఉండదు.

అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజు ఎవరైతే నల్ల నువ్వులను దానం చేస్తారో అలాంటి వారిపై శని ప్రభావం దోషం ఉండదని పండితులు చెబుతున్నారు.కనుక మకర సంక్రాంతి రోజు ఎవరికైనా నల్లనువ్వులను లేదా నల్ల నువ్వులతో తయారుచేసిన లడ్డూలను దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. ఇలా నల్లనువ్వులతో సూర్యుడు శనిని పూజించడం వల్ల శని ప్రభావం తొలిగిపోయి ఎంతో సుఖసంతోషాలతో ఉంటారని చెప్పవచ్చు.