జబర్దస్త్ కి రాకముందు ఆది, నూకరాజు ఏం చేసేవారో తెలిస్తే షాక్..?

ఒక మనుషి జీవితంలో ఎదిగి ఒక గొప్ప స్థానంలో ఉండాలంటే దాని వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది గతంలో ఎన్నో కష్టాలు అనుభవించి పట్టుదలతో పైకి వచ్చిన వారే. ఎవరో కొంతమంది మాత్రం పుట్టుకతోనే కోటీశ్వరులుగా పుడతారు. అయితే ప్రస్తుతం మనందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్లు జబర్దస్త్ కి రాకముందు ఎన్నో కష్టాలను అనుభవించారు. నిజానికి ఇప్పుడూ జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఎంతో మంది గతంతో మూడు పూటలా కడుపునిండా తిండి తినటానికి కూడా ఇబ్బంది పడ్డారు.

ప్రస్తుతము ఉన్న జబర్దస్త్ ఆర్టిస్టులతో ఆది నెంబర్ వన్ గా గుర్తింపు పొందాడు. కానీ జబర్దస్త్ కి రాకముందు ఆది కూడా చాలా కష్టాలు పడ్డాడు. బీటెక్ చదివిన ఆది ఉద్యోగం కోసం చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో కాలం కష్టపడిన ఆది చివరికి ఉద్యోగం సంపాదించాడు. అయితే ఇండస్ట్రీ మీద ఉన్న ఆసక్తితో ఆది ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ కి వచ్చేసాడు. అయితే అక్కడ ఆది ఖర్చులకోసం తన తల్లిదండ్రులు 20 లక్షలు అప్పు చేసి ఆ అప్పు తీర్చడానికి తమ ఊరిలో ఉన్న మూడు ఎకరాల పొలాన్ని కూడా అమ్మేశారు. మొదట అదిరే అభి టీం లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన ఆది తర్వాత తన కామెడీ టైమింగ్ తో పంచులతో టీం లీడర్ గా ఎదిగాడు. ఆది జబర్దస్త్ కి వచ్చిన తర్వాత మూడు ఎకరాలకి బదులు 16 ఎకరాల పొలం కొన్నాడు.

ఇంకా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన మరొక కమీడియన్ నూకరాజు. జబర్దస్త్ కి రాకముందే నూకరాజు కూడా ఒక పూట తిండి కోసం, రూమ్ రెంట్ కట్టడం కోసం చాలా కష్టాలు పడ్డాడు. నూకరాజు కూడా తనకి నటన మీద ఉన్న ఆసక్తి వల్ల ప్రభుత్వ ఉద్యోగం వదులుకొని మరి హైదరాబాద్ కి వచ్చాడు. అవకాశాల కోసం చాలా కాలం సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగాడు. ఇంటి నుండి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో తాపీ పని చేసి డబ్బులు సంపాదించాడు. పది అంతస్తుల బిల్డింగ్‌కి ఇసుక, సిమెంట్, ఇటుకలు భుజంపై మోసుకుని వెళ్లేవాడు. ఇలా ఎంతో మంది నిజ జీవితంలో కష్టపడి పైకొచ్చి ప్రస్తుతం ఆర్థికంగా కాస్తా కుదుటపడి సెటిలయ్యారు.