Paneer: పన్నీర్ లోని పోషకాలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

కొన్నేళ్ల నుంచీ భారతీయుల్లో పన్నీర్ వాడకం ఎక్కువైంది. ఆరోగ్యాన్నిచ్చే పన్నీర్ వల్ల ప్రయోజనాలెన్నో ఉన్నాయి. దీంతో పన్నీర్ తమ ఆహారంలో భాగం చేస్తున్నారు. పన్నీర్ పాల ఉత్పత్తి. దీంతో పాల వల్ల మనకు అందే పోషకాలన్నీ పన్నీర్ వల్ల కూడా అందుతాయి. కాల్షియం, విటమిన్ డి, రొమ్ము కాన్సర్‌ను దూరం చేస్తాయి. నిరోధక శక్తిని పెంచుతుంది. పన్నీర్‌లోనా జింక్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. షుగర్‌ని కంట్రోల్ చేయడంతోపాటు టెన్షన్లు తట్టుకునేలా చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి కూడా పన్నీర్ మంచిది. రక్తప్రసరణ, రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. పన్నీర్‌లో మెగ్నీషియం ఒక ఉత్ప్రేరకంలా పనిచేసి జీవ రసాయనిక చర్యల్ని ప్రోత్సహిస్తుంది. శరీరంలోని వివిధ రకాల ఎంజైమ్‌లను చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. కండరాలు, నాడుల పనితీరును మెరుగుపరుస్తుంది. పన్నీర్ లో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని అందించి శక్తివంతంగా చేస్తుంది. శరీరానికి రోజువారీ అవసరమయ్యే కాల్షియంలో  8శాతం దీని ద్వారా లభిస్తుంది. పిల్లలు, పెద్దలకు కూడా ఉపయోగపడుతుంది.

గర్భిణులకు పన్నీరు మంచి ఆహారం. పన్నీర్ లో ప్రొటీన్లు కూడా ఎక్కువే. దీనిలో ఉండే ఫాస్ఫరస్, ఫాస్ఫేట్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ఇందులోని వే ప్రోటీన్  ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అథ్లెటిక్స్‌, బాడీ బిల్డర్‌లు, స్ప్రింటర్‌లు.. క్రీడాకారులకు మంచి ప్రోటీన్ అని చెప్పాలి. నెమ్మదిగా జీర్ణం అవుతూ నెమ్మదిగానే శక్తిని ఇస్తుంది. కంటి సమస్యలను చెక్ పెట్టడంలో పన్నీర్ మంచి ఆహారం. రేచీకటి సమస్యను నిరోధిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలి లేమిని పోగొడుతుంది.

ప్రొస్టేట్‌ ఇబ్బందులను తొలగిస్తుంది. పన్నీర్‌లోని పొటాషియం శరీరంలో ద్రవ నియంత్రణ పదార్ధంగా పని చేస్తుంది. పన్నీర్ ను రెగ్యులర్‌గా తినడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని తేలింది. సెలీనియం ఎక్కువగా ఉంటుంది. పన్నీరును వంటల్లో వేయడం వల్ల శరీరంలోకి విష వ్యర్థాలు రాకుండా ఉంటాయి. అంటువ్యాధులకు విరుద్ధంగా పోరాడుతుంది. ఇన్నిరకాల ప్రయోజనాలున్న పన్నీర్ ను ఓ పట్టు పట్టండి మరి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.